కోహ్లీ-అనుష్క చెట్టాపట్టాలేసుకుని..

news02 June 19, 2019, 8:05 p.m. general

virat anushka

 

దాయాది దేశం పాకిస్థాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌ గెలుపు తరువాత టీమిండియా ఆటగాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీసీసీఐ అనుమతితో టీంఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో సహా మరి కొందరు ఆటగాళ్లు తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీం ఇండియా జట్టుకు ఐదు రోజులపాటు విరామం లభించింది. దీంతో రెండు రోజుల పాటు భారత జట్టు ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్‌ రద్దు చేసి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. అంతే కాదు ఆటగాళ్లతో కుటుంబసభ్యలు 15 రోజుల పాటు ఉండేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకేముంది టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో కలిసి లండన్‌ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. భారత జట్టులోని మిగతా ఆటగాళ్లు వారి వారి వారి కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్కల జంట లండన్‌ లోని ఓల్డ్‌ బాండ్‌ స్ట్రీట్‌ లో ప్రత్యక్ష్యమవ్వడంతో క్రికెట్ అభిమానులు వారి ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో వాపు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

tags: virat, virat kohli, virat anushka, virat kohli anushka sharma, virat anushka in london, anushka virat in london street

Related Post