ఉత్త‌రాదిని కుదిపేసిన పిడుగులు

news02 May 29, 2018, 5:07 p.m. general

thunders
ఢిల్లీ: ఉత్త‌రాదిని పిడుగులు కుదిపేశాయి. ప‌లు రాష్ట్రాల్లో పిడుగులు బీభ‌త్సం సృష్టించాయి. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో పిడుగుల ధాటికి 34 మంది చ‌నిపోయారు. మ‌రో 30 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. హర్దొయ్, సితాపూర్, ఫరూఖాబాద్ ప్రాంతాల్లో పిడుగులు ప‌డి భారీ న‌ష్టం సంభ‌వించింది. వ‌ర్షంతో కూడిన పిడుగులు ప‌డ‌డంతో.. జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. అనేకచోట్ల చెట్లు నెల‌కూలాయి. 

thunders 2

పిడుగులు పడిన ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ర‌వాణా, విద్యుత్ వ్య‌వ‌స్థ స్థంభించిపోయింది. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది. పిడుగులు ఎక్కువ‌గా ప‌డుతుండ‌డంతో...జ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు జంకుతున్నారు. మరో 24 గంటలు ఇలాగే ప‌రిస్థితి ఉండ‌వ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిస్తోంది. పిడుగులు, గాలి దుమారంతో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తోంది. 

tags: thunders effect in north india, bihar,jharkhand,up,rain,

Related Post