మీకంతా జయమే కలగాలి..

news02 Oct. 18, 2018, 6:48 a.m. general

dasera

శక్తి పూజకు ప్రాధాన్యం దేవీ శరన్నవరాత్రులు. మన దేశంలో భిన్నభాషా సంప్రదాయాల రాష్ట్రాలున్నా అందరూ వారివారి పద్ధతుల్లో ఆచరించే మహాద్భుత నవరాత్రులివి. ఆది పరాశక్తి విజయాలను స్మరించి ఆరాధించే ఈ పండుగలు ప్రధానంగా- లోక కంటకమైన, బాధాకరమైన దుష్టశక్తులను దునుమాడే దివ్యశక్తిని అర్చించే వైభవాన్ని తెలియజేస్తాయి.
జయ, విజయ అనే రెండు శక్తులు సేవిస్తున్న అపరాజితా దేవిని ఈ విజయదశమినాడు ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అగ్ని గర్భ అని పేరు పొందిన యజ్ఞవృక్షమైన శమీ సన్నిధిలో ఈ విజయశక్తిని అర్చించడమే శమీ పూజగా పిలుస్తున్నాం. న్యూస్ పిల్లర్ రీడర్స్ కు విజయదశమి శుభాకాంక్షలు. 

tags: dasara, dashera, vijaya dashami, dasera wishes, dushara wishes, vijayadashami wishes, dasara wishes

Related Post