హరిభూషణ్ సహా 12 మంది మావోలు..గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి

news02 March 2, 2018, 12:17 p.m. general

 

 

ఖమ్మం జిల్లా చెర్ల వెంకటాపూర్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  ఈ ఎన్ కౌంటర్ లో సీనియర్ మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి చెందారు. మరో 12 మంది మావోయిస్టులు.. ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కన్నుమూశారు. హరిభూషణ్  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరగుతున్నాయి. పలువురిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స జరుగుతోంది. ఘటనాస్థలం నుంచి ఏకే -47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. హెలీకాప్టర్లో అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన అధికారులు కూంబింగ్ పరిధిని మరింతగా పెంచారు.

మరోవైపు ఎన్ కౌంటర్ బూటకమని విరసం నేత వరవరరావు ఆరోపించారు. మావోయిస్టులను పట్టుకుని వచ్చి తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో చిత్రహింసలకు గురి చేసి చంపేసారని ఆయన అన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై తక్షణమే న్యాయవిచారణ జరిపించి బాధ్యులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

tags: maoist, Chhattisgarh, khammam, encounter

Related Post