పాక్ యువతి వలలో ఆర్మీ జవాన్

news02 July 13, 2019, 7:44 p.m. general

pak lady

గతంలో పాకిస్థాన్ యువతి వలలో చిక్కుకున్న జవాన్ ఘటన మరవక ముందే మరో జవాన్ కధ వెలుగులోకి వచ్చింది. దేశ భద్రతకు విఘాతం కలిగిస్తూ ఆర్మీకి సంబందించిన రహస్య సమాచారాన్ని లీక్‌ చేసినందుకు ఓ ఆర్మీ జవాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  సోషల్‌ మీడియాలో పరిచయమైన పాకిస్థాన్ కు చెందిన అమ్మాయికి దేశ భద్రతకు సంబంధించిన విషయాలు తెలియజేయడమే కాకుండా.. సైనికులు ఉపయోగించే ఆయుధాల ఫొటోలు కూడా పంపించాడీ ఘనుడు. హరియాణాలోని మహేందర్‌ గఢ్‌ జిల్లాకు చెందిన రవీందర్‌ కుమార్‌ 2017 నుంచి సైన్యంలో పనిచేస్తున్నాడు. 2018లో పంజాబ్‌లోని అమృత్‌ సర్‌లో విధులు నిర్వహిస్తుండగా.. ఫేస్‌ బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో తరచూ ఛాటింగ్‌, వీడియో కాలింగ్‌ చేసే రవీందర్‌.. ఇటీవల ఆమెతో సైన్యానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాదు జవాన్లు ఉపయోగించే రైఫిల్స్‌ ఫొటోలు కూడా ఆమెకు పంపించినట్లు విచారణలో వెల్లడైంది. జవాన్ రవీందర్‌ చర్యల గురించి పోలీసులకు రహస్య సమాచారం అందడంతో అతడిపై నిఘా పెట్టారు. పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్నాక అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. రవీందర్‌తో ఛాటింగ్‌ చేసిన మహిళ పాకిస్థాన్‌కు చెందిన యువతిగా గుర్తించారు. 


pakistan lady

tags: indian army, pakistan lady, pakistan lady honey trap, pak lady honey trap, pak lady honey trap indian army, pakistan lady honey trap indian army jawan, indian army honey traped in pak lady

Related Post