వినూత్న నిర‌స‌న‌తో అంద‌రినీ ఆక‌ర్శించిన రైతు ..!

news02 Dec. 18, 2018, 9:24 p.m. general

farmer

క‌ర్నూల్ : ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చేందుకు ఓ రైతు భిక్షాటన చేశాడు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో జరిగిన ఈ ఘటన స‌ర్వ‌త్రా  చర్చనీయాంశమైంది. మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లుకు చెందిన పొలం కబ్జాకు గురైంది. దీంతో తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ గత ఆరు నెలలుగా ఆయన తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, లంచం ఇస్తేనే పని అవుతుందని అధికారులు చెప్పడంతో నివ్వెరపోయాడు.

farmer

అధికారుల తీరుతోపాటు .. తన బాధను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వెంకటేశ్వర్లు నిరసన చేపట్టాడు. భార్యాపిల్లలతో కలిసి వెలుగోడు చేరుకుని .. లంచం ఇవ్వాలి ధర్మం చేయండి .. అని ఫ్లెక్సీలు పట్టుకుని నిరాహార దీక్ష చేపట్టాడు. తన భూమి కబ్జాకు గురైందని, తమకు ప్రాణ హాని ఉందని ఫ్లెక్సీల్లో రాసిన వెంకటేశ్వర్లు తమను పట్టించుకుని న్యాయం చేయాలని కోరాడు. లంచం కోసం భిక్షాటన చేస్తుండడం అంద‌రిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైయ్యింది. మ‌రి ఈ ఘ‌ట‌న‌పై ఏపీ స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

farmer

tags: Farmer Different Protest Aganist Curroption,Farmers Protest in ap,ap cm,Chandrababu,ap,amaravathi

Related Post