నగ్న చిత్రాలు ఫేస్ బుక్ లో

news02 March 7, 2018, 11:37 a.m. general


అనంతపురం- (క్రైం టీం)- ఈ మధ్య సోషల్ మీడియా మాద్యమంగా ఎన్నో నేరాలు.. ఘోరాలు జరుగుతున్నాయి. అలా అనంతపురంలో ఏ ప్రబుద్దుడు చేసిన పని ఎంటో చూడండి. అనంతపురం కు చెందిన సాయికృష్ణ ఉమాపతి జేఎన్టీయు లో చదువుతున్నాడు. ఇక ఇతనికి ఫేస్‌ బుక్‌ లో ఓ యువతి పరిచడం అయ్యింది. ఇక తాను ట్రాన్స్‌కో ఉద్యోగినని ఆమెను నమ్మించాడు. అంతే కాదు సదరు యువతికి సైతం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ నేపధ్యంలోనే తన కోరిక తీర్చకునేందుకు పధకం రచించాడు. అయితే తన పన్నాగం పండకపోయే సరికి యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఇంకేముంది చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. 

హైదరాబాద్ లో ఉంటూ ఓ ప్రభుత్వ సంస్థలో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసే యువతి (23)కి ఉమాపతి మూడేళ్ల కిందట ఫేస్‌బుక్‌ లో పరిచయమయ్యాడు. అనంతపురం మారుతినగర్‌ లో ఉండే ఇతను తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. ఈక్రమంలో ఆమె కుటుంబసభ్యులు సైతం అతనికి పరిచయం అయ్యారు.  యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని యువతితో పాటు.. వారి ఫ్యామిలీని నమ్మించాడు. అయితే ఆ తరువాత ఆమెకు ప్రియుడు ఉన్నాడని తెలియడంతో తన నిజస్వరూపం బయటపెట్టాడు. 

గతంలో బాధితురాలు పంపిన చిత్రాలను మార్ఫింగ్‌ చేసి నగ్నచిత్రాలుగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలంటూ వేధిచండం మొదలుపెట్టాడు. దీంతో విసిగిన బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేసిన నరేందర్‌ గౌడ్‌ సాంకేతిక ఆధారాల్ని సేకరించి నిందితుడిపై నిఘా ఉంచారు. యువతిని కలిసి బెదిరించేందుకు ఉమాపతి హైదరాబాద్‌ వచ్చినట్లు సమాచారం అందడంతో ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

tags: sexual harrasment, girl harrasment, face book harrasment,

Related Post