గోడ కట్టి తీరుతాను

news02 Feb. 6, 2019, 8:06 p.m. general

trump

అమెరికాకు రండి.. కానీ తప్పుడు దారుల్లో మాత్రం కాదంటున్నారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. న్యాయమైన మార్గాల ద్వార దర్జాగా అమెరికాకు వస్తే స్వాగతం పలుకుతామని ఆయన చెప్పారు.  ప్రతిభ ఉన్నవారు తమ దేశానికి రావొచ్చని ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం చేశారు. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అక్రమ వలసదారులు దేశానికి పెను ముప్పుగా ఆయన అభివర్ణించారు. అమెరికన్ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం తమ నైతిక బాధ్యత అని చెప్పిన అధ్యక్షుడు.. తమ చట్టాలను గౌరవిస్తూ లక్షల మంది వలసదారులు అమెరికాలో ఉంటున్నారని అన్నారు. 

trump

న్యాయపరంగా వచ్చే వలసదారులు అమెరికాకు ఎంతగానో ఉపయోగపడుతారని స్పష్టం చేశారు. మరోవైపు మెక్సికోలో సరిహద్దు గోడ నిర్మాణంపై కూడా ట్రంప్‌ తన ప్రసంగంలో పస్తావించారు. మెక్సికో సరిహద్దులో గోడ లేకపోవడం ఆర్థిక పరంగా, భద్రత పరంగా దేశానికి పెను ముప్పుగా ఉందని ఆయన అన్నారు. అందుకే ఆ సరిహద్దు గోడను కట్టి తీరుతానని మరోసారి స్పష్టంగా చెప్పారు. మెక్సీకో సరిహద్దు గోడ నిర్మాణానికి అంతా సహకరించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను మెక్సికో సరిహద్దు గోడను నిర్మించి తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ ప్రసంగంలో తేల్చి చెప్పారు.

tags: trump, us president, us president trump, america president trump, trump on visa, trump about visa

Related Post