అతని వయస్సు 67, ఆమె వయస్సు 24.. ఐతే ఏమయ్యింది.. ఇద్దరి మనస్సులు కలిశాయి. ఇంకేముంది పెళ్లి బంధంతో ఇరువురు ఒకటయ్యారు. ఇదేం చోద్యం అనుకుంటున్నారా.. కానీ ఇది నిజంగా జరిగిందండీ బాబు. పంజాబ్ లోని ధూరి సబ్ డివిజన్ పరిధిలోని బలియాన్ గ్రామానికి చెందిన 67 ఏళ్ల షంషేర్, 24 ఏళ్ల నవ్‌ప్రీత్ కౌర్ లు చండీగఢ్‌లోని గురుద్వారాలో జనవరిలో పెళ్లి చేసుకొన్నారు. వయసు రీత్యా భారీ తేడా ఉన్న ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీరిద్దరి కుటుంబసభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో కుటుంబసభ్యులు, బంధువుల నుంచి ప్రాణహాని ఉందంటూ షంషేర్, నవప్రీత్ కౌర్ లు హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వారిద్దరికి రక్షణ కల్పించాలని న్యాయస్థానం సంగ్రూర్, బర్నాల జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. ఇదన్నమాట సంగతి.