ఆద్భుతం ఆ ప్రదేశం..

news02 Nov. 12, 2018, 9:26 p.m. general

lake komo

గత కొన్ని రోజులుగా మనకు బాగా వినిపిస్తున్న పదం.. లేక్‌ కోమో. ఏంటీ లేక్ కోమో అని అనుకుంటున్నారా.. ప్రపంచంలోనే బెస్ట్ వెడ్డింద్ డెస్టినేషన్ గా ఈ ప్రాంతం పేరు తెచ్చుకుంది. బాలూవుడ్ ప్రేమికులు దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ల పెళ్లి సైతం ఇక్కడే జరగబోతోంది. సరిగ్గా రెండు నెలల క్రితం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఈశా ఎంగేజ్ మెంట్ సైతం లేక్ కోమో లోనే జరిగింది. మరి అంబానీ లాంటి వారు ఇక్కడ కుమార్తె ఎంగేజ్ మెంట్ జరిపించారంటే ఈ ప్రాంతానికున్న ప్రాధాన్యత ఎంటో అర్దమైపోతోంది. 

lake komo

ఇంతకీ లోక్ కోమో ప్రత్యేకత ఎంటో తెలుసుకుందామా... అటలీ దేశంలో చాలా అందమైన సరస్సులు ఉంటాయి. ఇలాంటి అందమైన సరస్సుల్లో లోక్ కోమో అతి ముఖ్యమైందని చెప్పవచ్చు. వై ఆకారంలో ఉండే ఈ సరస్సు చుట్టూ పచ్చదనం పరుచుకున్నట్లు మైదానాలు, దట్టమైన కొండలు నెలవై ఉంటాయి. అంతే కాదు సరస్సు పరిసర ప్రాంతాల్లో ఎంతో అందమైన లగ్జరీ గెస్ట్ హౌజ్ లు ఉంటాయి. చాలా ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన పార్కులే లేక్ కోమో లో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వాతావరణం పెళ్లి లాంటి వేడుకలకు అనుకూలంగా ఉంటుంది. చుట్టూ కొండలున్నప్పటికీ ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. అన్ని కాలాల్లోను సన్నగా మంచు పడుతూ ఉంటుంది. 

lake komo

ఇక తెల్లవారు జామున మంచు పడే సమయంలో ఈ సరస్సు అందాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి. లేక్ కోమో లో అత్యంత విలాసవంతమైన వసతులతో పాటు భద్రత కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ప్రతి రిసార్టులోనూ పెద్ద సంఖ్యలో అత్యాధునిక కెమెరాలుంటాయి. కొన్ని రిసార్టులను బుల్లెట్‌ ప్రూఫ్‌తో నిర్మించారంటే భద్రత ఏ లెవల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. విదేశాల నుంచి లేక్ కోమోకు వెళ్లే వారు ఇలాంటి రిసార్టుల్లోనే నివాసం ఉంటరు. అందుకే దేశవిదేశాల్లోని ప్రముఖులు లోక్ కోమోలో శుభ కార్యాలు చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారన్నమాట.

tags: lake, lake komo, lake komo special, about lake komo , lake komo itali, italy lake komo, deepika marraiage at lake komo, isha ambani marriage at lake komo

Related Post