మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆస‌క్తిక‌ర‌ తీర్పు

news02 May 28, 2018, 10:57 a.m. general

diverce

భోపాల్: మామూలుగా భార్య‌-భ‌ర్త‌లు విడిపోయిన‌ప్పుడు భార్య‌కు భ‌ర‌ణం ఇవ్వ‌డం ప‌రిపాటి. తాను సంపాదిస్తున్న దాంట్లో నుంచి కోర్టు ఆదేశాల మేర‌కు భ‌ర్త, భార్య‌కు భ‌ర‌ణం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలా కోర్టులు తీర్పులు ఇచ్చిన‌ప్ప‌టికీ... భార్య‌ల‌కు చాలా మంది భ‌ర్త‌లు భ‌ర‌ణం ఇవ్వని సంఘ‌ట‌న‌లు కొకోల్ల‌లు. తాము బ‌తికేదే క‌ష్ట‌మైన‌ప్పుడు.. ఇక భార్య‌కేం భ‌ర‌ణ‌మిస్తామ‌ని మొండికేసిన‌ ఘ‌ట‌న‌లున్నాయి. అయితే ఇలాంటీ వారికే బుద్ది చెప్పే విధంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆస‌క్తిక‌ర‌మైన తీర్పునిచ్చింది. 

bsnl

భ‌ర్త యొక్క అస‌లు సంపాద‌నేంతో తెలుసుకునే హ‌క్కు విడాకులైన మాజీ భార్య‌కుంద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు వెల్ల‌డించింది. భ‌ర్త‌ తాము ప‌నిచేస్తున్నవ‌ద్ద వ‌స్తున్న జీతం వివ‌రాల‌ను ఎట్టి ప‌రిస్థితిల్లో దాచ‌డానికి వీల్లేద‌ని తీర్పు చెప్పింది. సునీతాజైన్ అనే మ‌హిళా విడాకులు తీసుకున్న త‌న భ‌ర్త ప‌వ‌న్‌కుమార్ జీతం వివ‌రాలు కావాల‌ని బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యంలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకుంది. అయితే అందుకు బీఎస్ఎన్ఎల్ అధికారులు ఆమె విజ్ఞ‌ప్తిని తిర‌స్క‌రించారు. 

cvc of india

దీంతో ఆమె కేంద్ర స‌మాచార క‌మిష‌న్ ఆశ్ర‌యించింది. అక్క‌డ సునీతాజైన్‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. అయితే సీవీసీ ఆర్డ‌ర్‌ను స‌వాల్ చేస్తూ.. సునీతాజైన్ మాజీ భ‌ర్త ప‌వ‌న్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టును ఆశ్ర‌యించాడు. అయితే ప‌వ‌న్ పిటిషన్ ను ప‌రిశీలించి హైకోర్టు ప‌వ‌న్ అభ్య‌ర్థ‌నను తిర‌స్క‌రించ‌డం విశేషం. భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ భార్య‌ త‌మ మాజీ భ‌ర్త సాల‌రీ పేస్లిప్‌ల‌ను అడ‌గొచ్చ‌ని తీర్పు చెప్పింది. అంతేకాకుండా భ‌ర్త‌లు త‌మ సాల‌రీ వివ‌రాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో గోప్యంగా ఉంచాడానికి వీల్లేద‌ని వెల్ల‌డించ‌డం విశేషం. 

madya pradesh high court

అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు తీర్పు భార్య‌ల‌కు విడాకులు ఇచ్చిన భ‌ర్త‌ల‌కు చెంప‌పెట్టులాంద‌ని న్యాయ‌కోవిదులు అంటున్నారు. విడాకులు ఇచ్చి చేతులు దులుపుకుంటే స‌రిపోద‌ని హెచ్చ‌రిస్తున్నారు. సో మాజీ హాస్బెడ్స్ త‌స్మాత్ జాగ్ర‌త్త‌...! డైవ‌ర్స్ ఇచ్చి ఎంతో కొంత ఇచ్చి ఊరుకుంటే కుద‌రంటా సుమా..! సో బీర్ కేర్ పుల్ టూ యూ ఎక్స్ వైప్స్‌...! 

tags: mp high court,exwife,bsnl,pavan kumar,sunita jain,bhopal,legal,families,marriage

Related Post