రేపిస్టు సుబ్బ‌య్య చంపి ప్ర‌భుత్వం గండం నుంచి బ‌య‌ట ప‌డిందా..?

news02 May 4, 2018, 9:59 p.m. general

rapist subbaiah

గుంటూరు ః దాచేప‌ల్లి రేప్ నిందితుడు ఆత్మ‌హ‌త్య‌పై అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు స్థానికులు. ప్ర‌భుత్వంపై వ‌స్తున్న వ్య‌తిరేఖ‌త‌ను త‌గ్గించుకునేందుకు టీడీపీ ప్ర‌భుత్వం నాటకం ఆడుతోందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. చిన్నారిపై లైంగిక దాడి చేసినప్ప‌టినుంచి నిందితుడు సుబ్బ‌య్య ప‌రారీలో ఉన్నాడు. ప్ర‌తి ప‌క్షాలు స్పందించే వ‌ర‌కు ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేదు. ఆ త‌ర్వాత ఆందోళ‌న ప్ర‌తి ప‌క్షాల చేతికి వెలుతున్న స‌మ‌యంలో 17 బృందాల‌తో నిందితుడిని వెతుకుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

rapist subbaih house damage

గ‌త రెండు రోజులుగా ఈ అత్యాచారం ప్ర‌భుత్వ వైప‌ల్యంగా వైసీపీతో స‌హా మిగ‌తా రాజ‌కీయ పార్టీలు చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మొన్న జ‌మ్ము కాశ్మీర్ లో ఆసీఫా అత్యాచార కేసు లో మోడీ ప్ర‌భుత్వం ఎంత బ‌ద‌నాం అయ్యిందో అంద‌రికి తెలిసిందే. ఆసీఫా విష‌యంలో చంద్ర‌బాబుకూడా బీజేపీని త‌ప్పుప‌ట్టాడు. దాచేప‌ల్లి విష‌యంలో కూడా ఆందోళ‌న శృతిమించ‌టంతో ప్ర‌భుత్వం ఇరుకున ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే రెండు రోజుల వ‌ర‌కు స్పందించ‌ని చంద్ర‌బాబు సోమవారం అంద‌రు క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించాల‌ని బ‌య‌టికి వ‌చ్చారు.

నిందితుడు సుబ్బ‌య్య గురువారం సాయంత్ర‌మే పోలీసుల‌కు చిక్కిన‌ట్లు ఆయ‌న బందువులు చెబుతున్నారు. సుబ్బ‌య్య బ్ర‌తికుంటే ఈ ఆందోళ‌న‌లతో స‌ర్కారు ఇబ్బంది ప‌డుతుంద‌నే కార‌ణంతోనే చంపి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని బందువులు ఆరోపిస్తున్నారు.  ఆత్మ‌హ‌త్య గా చెబుతున్న స్థ‌లంలో కూడా సుబ్బ‌య్య పాదాలు భూమికి తాకుండ‌టం త‌మ‌కు అనుమానాలు క‌లిగిస్తున్నాయ‌ని బందువులు అన్నారు. 

subbaiah sucide

tags: dachepalli, rape Accused, subbaih, suspicious death, ap rapist, chandrababu, hanging, guntur death, ycp roja.

Related Post