ప్రమాదంపై రాహూల్ ఆరా..

news02 Sept. 11, 2018, 9:59 p.m. general

rahul

కొండగట్టు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని రాహూల్ పార్టీ నేతలను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని రాహూల్ ఆకాంక్షించారు. 

uttam

ఇక కొండగట్టు బస్ ప్రమాదంపై పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తం 56 మంది చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించి వారికి కేవలం ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోకుండా.. వారి కుటుంబాలకు అండగా ఉండి.. అన్ని విధాలుగా సాయం చేయాలని ఉత్తమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డవానిరి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. 

tags: kondagattu, kondagattu accident, rahul on kondagattu accident, uttam on kondagattu accident, rahul gandhi about kondagattu accident, uttam kumar reddy on kondagattu accident, kondagattu bus accident

Related Post