మాయమై పోతున్నడమ్మ మనిషన్నవాడు

news02 April 15, 2018, 10:22 p.m. general

Raped girl Ashifa funerals

జమ్మూ : మానవత్వం మంట కలిసింది. దుండగుల చేతిలో క్షోభను అనుభవించి ప్రాణాలు వదిలిన 8ఏళ్ల చిన్నారి ఆషిఫా కోసం దేశమంతా తల్లడిల్లుతోంది. కానీ వారి ఊరి ప్రజల మనుసు మాత్రం చలించలేదు. ఆషిఫా అంత్యక్రియలు చేసేందుకు గ్రామ ప్రజలు ఒప్పుకోలేదు. ఆషిఫా సంఘటనపై అందరు జాలిని, దయను చూపిస్తుంటే గ్రామ ప్రజలు మాత్రం కరుణించలేదు. మృతదేహం ఖననం చేసేందుకు గ్రామ ప్రజలు ఒప్పుకోలేదు.

Girl Ashifa parents

కథువాలోని ఎనిమిదేళ్ల చిన్నారి ఆషిఫా పై దుండగులు అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆషిఫా మృతదేహన్ని వారి సొంత గ్రామం రసానా శివారులో ఖననం చేయాలని ఆ అమ్మాయి తండ్రి నిర్ణయించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన ఇద్దరు కూతుళ్లు, తల్లి డెడ్ బాడీ లను గతంలో అక్కడనే ఖననం చేశారు. వారి సమధుల పక్కనే ఆషిఫా ఖననం కోసం గోతి తవ్వుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

Girl Ashifa dead body

ఆషిఫా కుటుంబం తెగ అయిన బక్రావల్ వాళ్ళ ను ఇక్కడ ఖననం చేయొద్దని వారు అడ్డుకున్నారు. ఆవూరి ప్రజలు ఎంతకు ఒప్పుకోకపోవటంతో పక్క గ్రామంలో ఉండే వారి బందువు తన స్థలంలో ఖననం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఆ గ్రామానికి 8 కి.మీ. దూరంలోని బక్రవాల్‌ తెగకు చెందిన వారు ఎక్కువగా నివసించే కనాహ్‌ గ్రామానికి బాలిక మృతదేహాన్ని వణికించే చలిలో బంధువులు తీసుకెళ్లారు. చీకటి పడకముందే ఆషిఫా అంత్యక్రియలు పూర్తి చేశామని తల్లిదండ్రులు చెప్పారు. వాస్తవానికి రసాల ప్రాంతంలో చిన్నారిని ఖననం చేయలనుకున్న భూమి హిందూ కుటుంభం నుంచి గతంలోనే ఆషిఫా తండ్రి కొనుగోలు చేశారట. కానీ సరైన పత్రాలు రాసుకోకపోవడంతో వాటినే ఆధారంగా చూపి చిన్నారి ఖన్నానని అడ్డుకున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఆషిఫా సంఘటనలో దుండగులు ఒక్కరే దోషులు కాదు .. మనస్సు లేని ఆ గ్రామస్తులు కూడా దోషులే నని నెటిజన్లు మండిపడుతున్నారు.

tags: Aahifa, raped girl, kathuva rape case, Jammu rape case, child rape case, pm modi, temple rapes.

Related Post