పార్దీవ దేహంపై టీడీపీ జెండా..

news02 Aug. 30, 2018, 6:51 p.m. general

babu

హైదరాబాద్- మాజీ ఎంపీ.. సినీ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. మెహిందీ పట్నంలోని హరికృష్ణ నివాసం నుంచి మద్యాహ్నం ప్రారంభమైన అంతిమ యాత్ర ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం వరకు సాగింది. హరికృష్ణ నివాసంలో ఆయన పార్ధవదేహాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా అంతిమ యాత్ర వాహనంలోకి ఎక్కించారు. ఇక చంద్రబాబు నాయుడు హరికృష్ణ పార్థీవ దేహం ఉంచిన వాహనంలో ఎక్కి  అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

babu

హరికృష్ణ అంతిమ యాత్ర కొనసాగినంత సేపు వేలాది మంది అభిమానులు, టీడీపీ శ్రేణులు యాత్రలో పాల్గొన్నాయి. ఇక ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ చితికి నిప్పంటించారు.  చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ పార్దీవదేహాన్ని ఉంచిన పాడెను మోయడం ఆసక్తిగా మారింది. అంతకు ముందు హరికృష్ణ పార్దీవ దేహాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకెళ్లాలలని అనుకున్నా అనివార్య కారణాలతో తీసుకెళ్లనందున ఆయన పార్దీవ దేహంపై చంద్రబాబు టీడీపీ జెండాను కప్పారు.

tags: harikrishna, harikrishna died, harikrishna funeral, harikrishna dead body, harikrishna no more, chandra babu in harikrishna funeral

Related Post