నన్ను బతకనివ్వండి నాన్నా..

news02 July 12, 2019, 7:11 a.m. general

mla daughter

పరువు హత్యలు రోజు రోజుకు మితిమీరిపోతున్న నేపధ్యంలో.. ఓ కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుని.. తండ్రి చేత ప్రాణ హానీ ఉండటంతో.. నాన్నా నన్ను చంపేస్తారా అని ధీనంగా ప్రశ్నిస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బరేలీ ఎమ్మెల్యే కూతురు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. బీటేపీ ఎమ్మెల్యే  రాజేశ్‌ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా గత వారం వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడు అభితేష్‌ కుమార్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. అందుకే తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. 
bjp mla daughter
సాక్షి మిశ్రా వీడియో సారాంశం తెలుగులో.. గౌరవనీయులైన పప్పు భార్తౌల్‌ జీ(రాజేశ్‌ ముద్దు పేరు).. మీరు మమ్మల్ని బతకనివ్వండి.. ప్రశాంతంగా ఉండనివ్వండి.. నేను నిజంగా పెళ్లి చేసుకున్నాను.. ఫ్యాషన్‌ కోసం నేను బొట్టు పెట్టుకోలేదు.. నన్ను చంపడానికి మీరు కొందరిని పంపారు.. కానీ నేను వారి నుంచి తప్పించుకున్నాను.. ఇప్పుడు మా ఇద్దరి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి.. నా భర్త, అతడి కుటుంబ సభ్యులను హింసించడం ఆపండి.. నేను ఆనందంగా జీవించాలనుకుంటున్నాను.. నన్ను చంపేస్తారా.. ఈ వీడియో ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను.. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకున్న అభికి గానీ, అతడి బంధువులకు గానీ ఏదైనా హాని జరిగితే దానికి నా తండ్రి, సోదరుడు విక్కీ బాధ్యులు.. దయ చేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఐతే తన కూతురి పెళ్లిని వ్యతిరేకించడం లేదని, కానీ ఆమె తన కన్నా వయసులో తొమ్మిదేళ్ల పెద్దయిన వ్యక్తిని చేసుకోవడం నచ్చలేదని ఆమె తండ్రి తెలిపారు. 

 

tags: bjp mla daughter, bjp mla daughter video, bjp mla daughter sakshi misra video, sakshi misra video viral, mla daughter sakshi video

Related Post