హైకోర్టు సంచలనం తీర్పు..

news02 June 9, 2018, 8:19 a.m. general

wife and husband

చండీగడ్ (నేషనల్ డెస్క్)- భార్యా భర్తల శృంగారం విషయానికి సంబందించి హరియాణా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమ తమ జీవిత భాగస్వామితో బలవంతపు శృంగారం, అసహజ శృంగారం చేస్తే అది విడాకులకు ప్రాతిపదికేనని పంజాబ్‌, హరియాణా హైకోర్టు తేల్చిచెప్పింది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఒక వివాహిత కు సంబందించిన కేసు విచార సందర్బంగా ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది. తన భర్త అతని కోర్కె తీర్చుకోవడం కోసం తనను తరచూ కొట్టేవాడని, అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని ఆమె కోర్టుకు ఆవేధన వ్యక్తం చేసింది. అందుకని తనకు భర్త నుంచి విడాకులు కావాలన్నవిజ్ఞప్తిని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చగా హైకోర్టును ఆశ్రయించింది.

b court

అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువు చేయలేకపోయారన్న దిగువ న్యాయస్థానం అభిప్రాయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. భార్యా భర్తల మధ్య జరిగే లైంగిక చర్యలు నాలుగు గోడల మధ్య జరిగేవని.. అట్టి చర్యలను మరెవ్వరు చూడలేరన్న కోర్టు.. అదే సమయంలో అలాంటి వాటిని వైద్యపరంగానూ అన్ని సార్లూ రుజువు చేయలేరని స్పష్టం చేసింది. అందుకే సదరు మహిళ విజ్ఞప్తి మేరకు భర్త నుంచి విడాకులను మంజూరి చేసింది హైకోర్టు ధర్మాసనం.

tags: punjab court, hariyana court, court on wife and husband sex,

Related Post