కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇక లేరు

news02 Feb. 28, 2018, 9:52 a.m. general

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన గత రాత్రి తీవ్ర అస్వస్థతతో కాంచీపురంలోని ఏబీసీడీ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. కంచి పీఠానికి ఆయన 69వ అధిపతిగా ఉన్నారు.  1935 జూలై 18నతమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆయన జన్మించారు. 1954 మార్చి 24న కంచి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. కంచి తదుపరి పీఠాధిపతిగా  శంకర విజయేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించనున్నారు.

tags: kanchi, jayendrasaraswathi, kanchipuram, abcdhospital, tamilnadu

Related Post