మనం మనుషులమేనా..?

news02 March 4, 2018, 9:54 p.m. general

No humanity in karnataka

బెంగుళూర్ : కర్ణాటక రాష్ట్రంలో మానవత్వం మంట కలిసింది. రక్త సంబంధీకులు, బంధువులు అందరూ కలిసి మానవత్వాన్ని మంట కలిపారు. ఈ హృదయ విదాఖర సంఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని గుల్గోడి గ్రామంలో జరిగింది. చివరికి పోలీసులే కొడుకొలుగా ఆ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.

అసలప్ప అనే వృద్ధుడు రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్పాట్ లోనే మరణించాడు అసలప్ప. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని ఆయన కొడుకు అసలప్ప స్దానికులను ప్రాధేయపడ్డారు. కానీ ఒక్కరుకుడా సహాయం చేయలేదు. అక్కడ అదే రోజు సూకట అనే పండుగను జరుపుకుంటున్నారు స్థానికులు. శవాన్ని తాకితే వారి ఇంట్లో కూడా కీడు జరుగుతుందని భావించిన జనం.. శవం దగ్గరికి కూడా రాలేదు. బంధువులు కూడా కనిపించకుండా పోయారు. దీంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఒక హోమ్ గార్డ్ ఆ ముసలప్ప కు ముగ్గురు కొడుకులుగా మారారు. సుదూర కొండ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. దహన సంస్కరాలు జరిపారు. మూఢ నమ్మకాలతో అనగరికంగా జనం వ్యవహరించారు.

tags: Humanity, karnataka police , road accident, good story .

Related Post