త్వరలోనే కొత్త ఇంట్లో కాపురం

news02 June 29, 2019, 6:29 a.m. general

isha

భారత దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన పెళ్లి కానుకనే ఇచ్చారు. ముంబయిలోని వర్లీలో 50వేల చదరపుఅడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భవనం ఖరీదు సుమారు 450 కోట్ల రూపాయలు ఉంటుందట. 
isha
వర్లీ ప్రాంతంలో సముద్రానికి అభిఎదురుగా ఉన్న ఈ భవనాన్ని గతేడాదే పిరమాల్‌ కుటుంబసభ్యులు కొనుగోలు చేశారు. వారి అభిరుచికి అనుగుణంగా దాన్ని తీర్చి దిద్దారు. ఈ బంగళా ఇంటీరియర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బంగళాకు వినియోగించిన ఫర్నిచర్‌ను విదేశాల్లో తయారు చేయించారు. ఔట్‌డోర్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌, మల్టిపుల్‌ డైనింగ్‌ రూములు, సమావేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన పెద్ద హాళ్లు ఉంటాయి. త్వరలోనే ఇషా దంపతులు ఈ బంగళాలో కాపురం పెట్టబోతున్నారన్నమాట.

tags: isha, isha ambani, isha ambani house, isha ambani new house, isha ambani costly house, isha ambani costly home, isha ambani new car

Related Post