ముగిసిన స‌మ్మ‌ర్ హాలీడేస్

news02 June 1, 2018, 11:34 a.m. general

schools open
హైద‌రాబాద్: నేటి నుంచే విద్యార్థులు బ‌డి బాట ప‌ట్ట‌నున్నారు. గ‌త అక‌డ‌మిక్ ఇయ‌ర్ క‌న్నా ముందే...ఈసారి పాఠ‌శాల‌లు ఓపెన్ అయ్యాయి.  జూన్ 02న రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఉండ‌డంతో.. రెండు రోజుల ముందుగానే విద్యాశాఖ‌ పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించింది. అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల‌ను అన్ని పాఠ‌శాల‌ల్లో అధికారింగా జ‌ర‌పాల‌ని స‌ర్కారు ఆదేశించిన నేప‌థ్యంలోనే... విద్యాశాఖ‌ స్కూల్స్‌ను 10 రోజుల ముందుగా ప్రారంభించింది. పార్మామేష‌న్ డే ఉన్నందున శుక్ర‌, శ‌ని వారాలు పుల్ డే స్కూల్స్ న‌డ‌వ‌నున్నాయి. 
schools open 2

అయితే ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున ఈనెల 04 నుంచి 08వ తేదీ వ‌ర‌కు మాత్రం ఒంటిపూట బ‌డులు న‌డ‌పాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యించింది. అంతేకాకుండా  పాఠ‌శాల‌లు ముందుగానే ప్రారంభ‌మైనందున ఇప్ప‌టికే విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన పుస్త‌కాలు, యూనిఫామ్స్‌ను  స్టూడెంట్స్‌కు అందించేందుకు సిద్ధం చేశారు. అలాగే రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా విద్యార్థుల‌కు ప‌లు కాంపిటిష‌న్ పోటీలు పెట్టి బ‌హుమ‌తుల‌ను కూడా ప్ర‌దానం చేయ‌నున్నారు. 

tags: schools open,badi baata,patasala,books, telangana formation day

Related Post