ఏపీ, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు

news02 Dec. 28, 2018, 9:22 a.m. general

hi court

ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ఇన్నాళ్లకు సాధ్యమైంది. ఈమేరకు ఉమ్మడి హైకోర్టు విభజకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిపికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోను హైకోర్టు కార్యకలాపాలు వేర్వేరుగా ప్రారంభం కానున్నాయి. ఇక  ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్‌ను విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వలు ప్రకారం ఈ గెజిట్‌ నోయిఫికెషన్ ను విడుదలచేసింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేటాయించింది. 

hi court

ఇక హైకోర్టు విభజనలో భాగంగా తెలంగాణ కు జస్టిస్‌ వెంకట సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కోదండరామ్‌ చౌదరి, జస్టిస్‌ శివశంకర్‌ రావు, జస్టిస్‌ షమీన్‌ అక్తర్, జస్టిస్‌ కేశవరావు, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ నవీన్‌ రావులను కెయాచించగా.. ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ వెంకట నారాయణ, జస్టిస్‌ వెంటక సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్‌ జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌  గంగారావు, జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ శేషాద్రి నాయుడు, జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌రావు, జస్టిస్‌ సునీల్‌ చౌదరి, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ శ్యాం ప్రసాద్‌, జస్టిస్‌ ఉమాదేవి, జస్టిస్‌ బాలయోగి, జస్టిస్‌ తేలప్రోలు రజనిలను కెటాయించారు.

tags: hi court, ap hi court, telangana hi court, ap te;angana hi court notification

Related Post