ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌క‌టించిన రైతు దంప‌తులు

news02 May 30, 2018, 12:15 p.m. general

rythuku retirement
ఖ‌మ్మం: మామూలుగా ప్ర‌భుత్వ ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డం స‌హ‌జం. స‌ర్వీసు పూర్తి అయిన త‌ర్వాత రిటైర్మెంట్ తీసుకోవ‌డం తెలిసిందే.ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న సంద‌ర్భంగా రిటైర్మెంట్ తీసుకోబోయే ఉద్యోగికి తోటి ఉద్యోగులు స‌న్మాన స‌త్కారాలు చేసి గౌర‌వంగా పంప‌డం ఆన‌వాయితీ. కానీ, ఖ‌మ్మం జిల్లాలో ఓ రైతు కుమారులు వినూత్న ప‌ద్ధ‌తికి శ్రీ‌కారం చుట్టారు. వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తున్న త‌మ త‌ల్లీదండ్రుల చేత‌ రిటైర్మెంట్ ప్ర‌క‌టింప‌జేశారు. అంతేకాదు బంధువులంద‌ర్నీ పిలిచి రిటైర్మెంట్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా జ‌రిపించారు. 

khammar  former couples

 

ఖ‌మ్మం జిల్లా హ‌ర్యాతండాకు చెందిన నాగులు, పూర్ణ దంప‌తుల‌కు ముగ్గురు కొడుకులు. వ్య‌వ‌సాయం చేసి ముగ్గురు కుమారుల‌ను ఈదంప‌తులు ఉన్న‌త చ‌దువులు చ‌దివించారు. ముగ్గురు కొడుకులు కూడా ఆర్థికంగా స్థిర‌ప‌డ్డారు. పెద్ద కుమారుడు రాందాస్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ప‌నిచేస్తుండ‌గా.. రెండ‌వ కుమారుడు సాప్ట్‌వేర్ ఉద్యోగిగా వ‌ర్క్ చేస్తున్నాడు. ఇక మూడో కొడుకు శ్రీను బీఈడీ చేసి ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం చ‌దువుతున్నాడు. 

khammam formers

అయితే వీరంద‌రూ ఆర్థికంగా స్థిర‌ప‌డ‌టంతో... వ్య‌వ‌సాయం చేస్తున్న త‌మ త‌ల్లిదండ్రుల‌తో రిట్మైర్మెంట్ చేయించాల‌ని భావించారు. అందుకు అనుగుణంగానే త‌మ పేరెంట్స్‌తో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయించి.. శాలువ‌ల‌తో స‌త్కారించారు. అంతేకాకుండా బంధువులంద‌ర్నీని పిలిచి గ్రాండ్‌గా ఫంక్ష‌న్ కూడా జ‌రిపించారు. ఇప్పుడు ఇదే ఖ‌మ్మంలో జిల్లాలో ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. వ్య‌వ‌సాయానికి ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌క‌టించ‌డంపైనే అంద‌రూ ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. 

khammam formers wishes to the retiremen couples

అయితే రిటైర్మెంట్‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ...నాగులు, పూర్ణ కుమారులు చేసిన ప‌నిని ప‌లువురు అభినందిస్తున్నారు. ప్ర‌తిసారి ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పంట‌లు పండించిన రైతులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల‌నే కాన్సెప్ట్ బాగుందంటున్నారు. జీవితం చ‌ర‌మాంకంలో శేష జీవితం హాయి గ‌డ‌పాల‌నే ఆలోచ‌న న‌చ్చిందంటున్నారు. అందుకే రిటైర్మెంట్ తీసుకున్న రైతు దంప‌తులు నాగులు-పూర్ణల‌కు ప‌లువురు రిటైర్మెంట్  విషెష్ కూడా చెబుతున్నారు. 

tags: rythu riterment,formers, padavi viramana,haryatanda,khammam

Related Post