తెలంగాణ‌లో నేల‌రాలిన మ‌రో నిరుద్యోగి ..!

news02 March 6, 2018, 10:52 p.m. general

హైదరాబాద్ : తెలంగాణాలో మరో నిరుద్యోగి రాలిపోయారు . స్వరాష్ట్రంలో ఉద్యోగ ,ఉపాధి ఇక సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి ..తన ఆశలు అడియాశలు అయ్యాయన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వికలాంగ నిరుద్యోగి .ఇన్నాళ్లు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసిన ఆ నిరుద్యోగి  ఇక అదిరాకపోవడంతో చావే శరణ్యం అనుకున్నాడు. తను తన నిరుపేద కుటుంబానికి భారం కాకూడదని భావించి ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి తన అంగవైకల్యం అడ్డువచ్చింది. దీనితో ఆర్టీసీలో అతని ఉద్యోగం పోయింది . ఒకవైపు ఉద్యోగం కల్పించని సర్కార్ ..మరోవైపు తన నిరుపేద కుటుంబం ..తనపై కుటుంబం పెట్టుకున్న ఆశలు అడియాశలు కావడంతో ఇక బ్రతికి కుటుంబానికి భారం కాకూడదని భావించి తానే అసువులు బాసారు. ఆ నిరుద్యోగే బొమ్మకంటి మహేందర్.

మహేందర్ ముదిరాజ్ ది నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం .. ఉదసుపల్లి గ్రామం. నిరుపేద కుటుంబలో పుట్టిన మహేందర్ డిగ్రీవరకు చదివాడు. ఎల్బీనగర్ లోని ప్రభుత్వ వికలాంగుల హాస్టల్లో ఉంటున్నారు. ప్రభుత్వ వేసే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లకోసం ఎదురుచూస్తూ..ప్రవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగంలో చేరారు.అయితే  కొన్ని రోజులు చేసిన మహేందర్ ను అంగవైకల్యంను సాకుగా చూపించి ఉద్యోగం నుండి తొలగించారని అతని స్నేహితులు చెబుతున్నారు. దీనితో మనస్తాపం చెందిన మహేందర్ హాస్టల్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . 

మహేందర్ మృతితో హాస్టల్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు .కాంగ్రెస్ వికలాంగుల సెల్ చైర్మన్ వీరయ్య నేతృత్వంలో హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. ఉద్యోగం రాలేదన్న ఆందోళనతో మహేందర్ ఆత్మహత్య చేసుకున్నాడని ..ఇది దిముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే ..ఆరోపించారు  వీరయ్య .

ఆందోళన చేస్తున్న వికలాంగులకు మద్దతు తెలిపారు మాజీ  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి .హాస్టల్ దగ్గరికి వచ్చి వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు సుధీర్ రెడ్డి .  మహేందర్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. ప్రభుత్వం తక్షణమే మహేందర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించే వరకు మృత దేహాన్ని తీయనివ్వం ..అన్నారు సుధీర్ రెడ్డి .హాస్టల్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

tags: Unemployed Sucide In Telangana State,Ex MLA Sudherreddy

Related Post