బారులు తీరిన జ‌నం

news02 May 30, 2018, 10:48 a.m. general

nepal petrol

పాట్నా: మామూలుగా ఎవ‌రమైనా వాహ‌నాల‌కు పెట్రోల్‌, డీజిల్ ఎక్క‌డ కొట్టిస్తాం..? ప‌దో ప‌ర‌క ఎక్కువైనా ద‌గ్గ‌ర‌లోని బంకుల్లోనే పెట్రోలు, డీసిల్ పోయిస్తాం. దూరం వెళ్లితే ఉన్న పెట్రోల్ బొక్క‌ని... అందుబాటులో ఉన్న‌ పెట్రోల్ పంపుల్లోనే ఇంధ‌నం నింపిస్తాం. కానీ, బీహార్‌లో మాత్రం ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పెట్రోలు, డీజీల్ బాదుడు నుంచి త‌ప్పించుకునేందుకు బీహారీలు స‌రికొత్త దారులు వెతుకున్నారు.

bihar-nepal border

పెట్రోలు, డీసీల్ సెగను త‌ప్పించుకునేందుకు బీహారీలు దేశ స‌రిహ‌ద్దు దాటి వెళ్లుతున్నారు. ప‌క్క‌నే ఉన్న నేపాల్ లో ఇంధ‌న ధ‌ర‌లు చౌక‌గా ఉండ‌డంతో.. అక్క‌డి బంకుల‌కు బీహార్ స‌రిహ‌ద్దు గ్రామాల వాహ‌న‌దారులు క్యూ క‌డుతున్నారు. ఉద‌యం నేపాల్ వెళ్లి బండి ట్యాంక్ ఫుల్ చేయించుకొని తిరిగి భార‌త్‌కు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం భారత్‌తో పోలిస్తే నేపాల్‌లో పెట్రోల్ 15, డీజిల్‌ 18 రూపాయాలు ధ‌ర త‌క్కువ‌గా ఉంది. అంతేకాకుండా మన కరెన్సీ  విలువ కంటె నేపాల్ క‌రెన్సీ విలువ త‌క్కువ‌. మ‌నం 100 రూపాయాలు నేపాల్ లో ఇస్తే...అక్క‌డ 160.15 నేపాల్ రూపీలు వ‌స్తాయి. 

nepal oil corporation

ప్ర‌స్తుతం బీహార్‌లో వాహ‌న‌దారులు నేపాల్ బాట ప‌ట్ట‌డ‌డంతో నేపాల్ ఆయిల్ కార్పొరేష‌న్ సంబ‌ర‌ప‌డుతోంది. త‌మ అమ్మ‌కాలు అమాంతం పెరుగుతుండ‌డంపై సంతోషం వ్య‌క్తం చేస్తోంది. భార‌త్ నుంచి వ‌స్తున్న వాహ‌న‌దారులతో తమ దేశానికి ఆదాయ వ‌న‌రులు పెరిగాయ‌ని చెబుతోంది. అయితే ఇంత‌లా పెట్రోలు, డీసీలు అమ్మ‌కాలు చేస్తోన్న నేపాల్‌కు..భార‌తే పెట్రో ఉత్ప‌త్తుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం విశేషం. అయితే భార‌త్ నుంచే పెట్రో ఉత్ప‌త్తులు స‌ర‌ఫరా అవుతున్న‌ప్ప‌టికీ.. నేపాల్‌లో పెట్రోల్‌, డీసీజ్ చౌక‌గా దొర‌క‌డంపైనే వాహ‌న‌దారులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 

nepal petro cortoon

tags: petrol,diesel,nepal,india,bihar, petro rates

Related Post