ఊరు పేరు అచ్చిరాలేద‌నే అలా చేశారంటా..!

news02 Aug. 10, 2018, 5:56 p.m. general

rajasthan

జైపూర్‌:మామూలుగా యువ‌కుల‌కు వ‌య‌స్సు మిరితేనో.. లేక‌...జీవితంలో సెటిల్ కాక‌పోతేనో పెళ్లిళ్లు కాక‌పోవ‌డం స‌హ‌జం. అందుకే బెండ‌కాయ ముదిరిన... పెండ్లి కొడుకు ముదిరిన పెండ్లి కావ‌డం క‌ష్ట‌మంటారు పెద్ద‌లు. ఇక జీవితంలో సెటిల్ కాక‌పోతే అబ్బాయికి పిల్ల‌నిచ్చేందుకు కూడా అమ్మాయి త‌ల్లిదండ్రులు ముందుకు రారు. అయితే రాజ‌స్థాన్‌లో మాత్రం వింత ప‌రిస్థితి ఏర్ప‌డిందంటా..! పెళ్లికి అబ్బాయి ముదిరిపోవ‌డ‌మో... లేక‌... జీవితంలో సెటిల్ కాక‌పోవ‌డ‌మో అభ్యంత‌రం కాదంటా..!

miyabankam village

అవును  ఇదేంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..! విన‌డానికి వింతగా అనిపిస్తున్న రాజ‌స్థాన్‌లోని మియాంకా బ‌రా అనే ఊరుకు ఆ విలేజ్ పేరే అక్క‌డి యువ‌కుల‌కు స‌మ‌స్య‌గా మారిందంటా..! ఊర్లో అన్ని సౌక‌ర్యాలున్నా... ఆ ఊరు పేరు కార‌ణంగానే అక్క‌డి యువ‌కుల‌కు పెండ్లిలు కావ‌డం లేదంటా..! ఊరు పేరు మియాంకా బ‌రా అని ఉండ‌డంతో... అక్క‌డ అబ్బాయిల‌కు పిల్ల‌నిచ్చేందుకు చుట్టు ప‌క్క‌ల గ్రామాల అమ్మాయిల త‌ల్లిదండ్రులు ముందుకు రావ‌డం లేదంటా..!మియాంకా బరా.. అనేది ముస్లిం ఊరి పేరు కావ‌డం.. దాని అర్థం ముస్లింల పరిష్కారం కావడంతో పెళ్లిళ్లు కావ‌డం లేద‌ని గ్రామ‌స్థులు వాపోయారు.

miyabankam

అందుకే ఈ నేప‌థ్యంలోనే ఊరు పేరును మార్చేసిన‌ట్లు చెబుతున్నారు మియాంకా బ‌రా గ్రామ‌స్థులు. గ్రామం పేరును మియాంకా బ‌రా నుంచి మ‌హేశ్‌న‌గ‌ర్‌గా చేంజ్ చేసుకున్నామ‌ని అంటున్నారు. అంతేకాదు మియాంకా బ‌రా పేరును మార్చిన విధంగా చుట్టు ప‌క్క‌న గ‌ల మ‌రో రెండు గ్రామాల పేర్ల‌ను కూడా మార్చ‌నున్న‌ట్లు చెబుతుండ‌డం కొస‌మెరుపు.

tags: rajastan,mira banka,muslim village name,miyabankam,rajasthan state,villages,bridegroom,bride,north india,marraiges,rajasthan government,bjp government,mahesh nagar

Related Post