అంబానీ వెడ్డింగ్ కార్డ్..

news02 Nov. 11, 2018, 7:05 a.m. general

ambani wedding

దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ముద్దుల కూతురు ఈశా అంబానీ పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు ఆనంద్ పిరమాల్ ను ఈశా వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ సైతం జరిగింది. ఇక డిసెంబర్ 12న ఇటలీలోని లేక్ కోమో దగ్గర ఈశా- ఆనంద్ ల పెళ్లి అంగరంగ వైబవంగా జరగబోతోంది. ఇక ఈశా పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ఉండబోతున్నాయి. 

siha ambani

ఈ క్రమంలోనే ఈశా అంబానీ పెళ్లి ఆహ్వాన పత్రికను ప్రక్యేకంగా తయారు చేయించారు. పెద్ద డిజైనర్ బాక్ల్ లో పెళ్లి వెడ్డింగ్ కార్డ్ ను ఉంచారు. ఇక వెడ్డింగ్ కార్డ్ పై ఐఏ అక్షరాలను రాశారు. ఐ అంటే ఈశా, ఏ అంటే ఆనంద్ అన్నమాట. బాక్స్ లో పెళ్లి కార్డు తీయగానే గాయత్రి మంత్రం యొక్క రాగం వినిపిస్తుంది. ఆ తరువాతి పేజీలో శ్రీకృష్ణిడి ఫోటో, తరువాత వధూవరుల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఆ తరువాత పేజీలో ఈశా, అనంద్ లు రాసిన సభ్ అభినందన్ లేఖ ను పొందుపరిచారు. మొత్తానికి అంబానీ స్థాయికి తగ్గట్టుగానే ఉంది పెళ్లి కార్డ్. ఇక పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా జరపబోతున్నారని వేరే చెప్పక్కర్లేదు. 

 

tags: isha, isha ambani, isha ambani marriage, isha ambani wedding card, isha ambani anand piramal wedding, isha ambani marriage card, ambanis wedding card

Related Post