చంద్ర‌బాబు ఏపీ, తెలంగాణ సీఎం అట‌...

news02 Feb. 24, 2018, 9:15 p.m. general

నారా చంద్ర‌బాబునాయుడు గారు ఏపీ,తెలంగాణ ముఖ్య‌మంత్రి అట‌.. ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గారు ఏపీ గ‌వ‌ర్న‌ర్ అట‌.. ఇలా ఎప్పుడు జ‌రిగింది?  అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు క‌దా.. విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న సీఐఐ స‌ద‌స్సుకి సంబంధించి ఏపీ స‌ర్కార్ అధికారికంగా జారీ చేసిన ప‌త్రంలో ఈ త‌ప్పులు దొర్లాయి.  మీడియాకి విడుద‌ల చేసే ముందైనా ఈ త‌ప్పిదాన్ని ఎవ‌రూ గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

చిన్న‌పాటి ఇన్విటేష‌న్ల‌లో త‌ప్పులు దొర్లితే త‌ల్ల‌డిల్లిపోతాం.. స‌రిచేసి ప్రింటింగ్ కి ఇస్తాం. అలాంటిది ఏపీ  ప్ర‌భుత్వం అధికారికంగా భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సుకి సంబంధించిన ప‌త్రాల్లో ఇంత పెద్ద త‌ప్పిదం జ‌రిగితే ఏ అధికారికి ఆ త‌ప్పు క‌న‌ప‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ ప‌త్రం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అధికారుల నిర్ల‌క్ష్యంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు న‌వ్వుకుంటున్నారు. ఇంకా న‌యం... ఏ రాష్ట్రప‌తో.. ప్ర‌ధానో అని ప్రింట్ చేయించ‌లేద‌ని సెటైర్లు వేస్తున్నారు. మ‌రి అధికారులు దీనికి ఏం స‌మాధానం చెబుతారో వెయిట్ అండ్ సీ... 

tags: andhrapradesh, chandrababu, apcm, telangana, cii, visakhapatnam

Related Post