సోమవారం శిక్ష ఖరారు..

news02 Sept. 4, 2018, 1:49 p.m. general

bomb

హైదరాబాద్ లో జంట పేలుళ్ల ఘటనలో ఎన్ ఐఏ కోర్టు ఎట్టకేలకు తీర్పునిచ్చింది. సరిగ్గా పదకొండేళ్ల క్రితం 2007 ఆగష్టు 25న నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో ఉగ్రవాదులు బాంబ్ పేలుళ్లకు పాల్పడటంతో 44 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముడాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అనీక్ షపీఖ్, అక్బర్ ఇస్మాయిల్ ను కోర్టు దోషుసుగా నిర్ధారించింది. మరో ముగ్గురు ఫరూఖ్ షప్రుద్దీన్, సాధిక్ ఇసార్, అంజూమ్ లను నిర్దోషులుగా ప్రకటించింది ఎన్ ఐఏ కోర్టు.

nia

ఇక దోషులకు సోమవారం శిక్ష ఖరారు చేయనుందు ఎన్ ఐఏ కోర్టు. బాంబు పేలుళ్ల తరువాత రెండేళ్లకు పట్టుబడ్డ ఐదు మంది ఉగ్రవాదులు అప్పటి నుంచి చర్లపల్లి జైళ్లో ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చడంతో.. మరో ముగ్గురిని జైలు నుంచి విడుదల చేయనున్నారు. దోషులుగా తేల్చిన వారికి ఎటువంటి శిక్ష పడుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

a
 

 

tags: nia, gokul chat, gokul chat blast, lumbini park blast, bomb blasts jugment, gokul chat blast judgment

Related Post