శ్రీదేవిని అలా అన‌కుండా ఉండాల్సింది: రాజ‌మౌళి

news02 Feb. 25, 2018, 2:44 p.m. general

డైరెక్ట‌ర్ రాజ‌మౌళి శ్రీదేవి మ‌ర‌ణం అనంత‌రం అన్న మాట‌లివి. అందుకు కార‌ణం ఉంది. బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌కు మొద‌ట రాజ‌మౌళిని శ్రీదేవిని సంప్ర‌దించారు. అయితే ఆమె భారీగా డిమాండ్ చేసింద‌ని ఆ పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ‌ను తీసుకున్నారు. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే విష‌యాన్ని రాజ‌మౌళి ప్ర‌స్తావించారు. రాజ‌మౌళి అలా మాట్లాడ‌టాన్ని శ్రీదేవి కూడా త‌ప్పుప‌ట్టారు. అయితే శ్రీదేవి మ‌ర‌ణ‌వార్త విన్న త‌రువాత రాజ‌మౌళి స్పందించారు. శివ‌గామి పాత్ర‌కు శ్రీదేవి నో అనడం.. భారీ డిమాండ్లు పెట్టిన విష‌యాన్ని తాను బ‌య‌ట‌కు చెప్ప‌కుండా ఉండాల్సింద‌ని రాజ‌మౌళి అన్నారు. తాను అలా చెప్పి పెద్ద పొర‌పాటు చేసాన‌ని.. అందుకు చింతిస్తున్నాన‌ని అన్నారు రాజ‌మౌళి. శ్రీదేవి పట్ల త‌న‌కెంతో గౌర‌వం ఉంద‌న్న రాజ‌మౌళి ఆమె మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మకు తీర‌ని లోట‌ని అన్నారు. 

tags: sridevi, rajamouli, shivagami, ramyakrishna, bahubali

Related Post