మోదీకి క్లోజ్ కాబట్టి జైల్లో పెట్టారు..

news02 Sept. 29, 2018, 7:32 p.m. general

pulkith

ఈ కాలంలో స్వామీజీలు.. బాబాల హవా ఎలా నడుస్తుందో అందరికి తెలిసిందే. సామాన్యుల నుంచి మొదలు ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు.. ఇలా అంతా బాబాలు, స్వామీజీలను నమ్మేవారే. ఐతే ప్రతిసారి ఎవరో ఒక స్వామీజి వ్యవహారం బయటపడటం పరిపాటిగా మారింది. అయినప్పటికీ వీరి ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. అసలు విషయం ఏంటంటే.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పుల్కిత్ మహారాజ్ ఓ స్వామీజి. బాగా పాపులర్ అయిపోవాలనుకున్న మహారాజ్ ఏకంగా ప్రధాని మోదీ పేరునే వాడుకున్నాడు. మోదీ తనకు బాగా క్లోజ్ అని.. ఆయనకు యోగా, ఆధ్యాత్మిక అంశాలు నేర్పించింది నేనే అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. 

pulkith maharaj

దీంతో అతడు బాగానే పాపులర్ అయ్యాడట. ఇంతవరకు ఆగితే బావుండేమో.. కానీ మహరాజ్ మరో అడుగు ముందుకేసి.. కల్చరల్ సెక్రెటరీ పేరుతో ఓ లెటర్ హెడ్ ను తయారు చేసి.. యూపీలో ఓ కలెక్టర్ కు లేఖ రాశాడు. ఇలా పుల్కిత్ మహారాజ్ జిల్లాకు వస్తున్నారు.. ప్రధాని మోదీకి బాగా కావాల్సిన వారు.. బాగా చూసుకొండని లెటర్ లో పేర్కొన్నాడు. అనుమానం వచ్చిన కలెక్టర్ ప్రధాని కార్యాలయానికి సమాచారం అందిచడంతో అసలు విషయం బయటపడింది. ఇంకేముంది ఇప్పుడు సదరు పుల్కిత్ మహారాజ్ జైల్లో ఉసలు లెక్కపెడుతున్నాడు. ఎంతైనా మోదీకీ బాగా క్లోజ్ కాబట్టి జైల్లో బాగానే చూసుకుంటున్నారనుకొండి...

tags: pulkith maharaj, pulkith maharaj about modi, pulkith maharaj on pm modi, pulkith maharaj arrested, pulkith maharaj about pm modi

Related Post