దటీజ్ చంద్రబాబు..

news02 April 5, 2018, 8:46 a.m. general

hardeep singh with chandra babu

న్యూ ఢిల్లీ-  సార్.. నేను మీ అభిమానిని అంటూ..  చంద్రబాబుతో సెల్ఫీ తీసుకొని మురిసిపోయాడు ఓ కేంద్రమంత్రి..
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అన్ని పార్టీల నాయకులతో సమావేశాల్లో బిజీగా ఉన్న చంద్రబాబుకి ఊహించని ఫ్యాన్ ఎదురయ్యాడు. సార్… నేను మీ అభిమానిని, నేను కేంద్ర మంత్రిని... మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చంద్రబాబుపై తన అభిమానం బైటపెట్టుకున్నాడు. చంద్రబాబుతో సెల్ఫీ దిగి… చాలా హ్యాపీగా ఉందన్నారు. అంకేముంది… చుట్టూ ఉన్నవాళ్లు మొదట షాక్ తో చూస్తుండిపోయారు. తర్వాత దటీజ్ చంద్రబాబు అంటూ నవ్వులు పూశాయ్ అక్కడ. చంద్రబాబు స్థాయి ఏంటో చెప్పే ఈ సీన్ చూసి మిగతా పార్టీల నాయకులు ఆశ్చర్యం కాదు అనందంతో కనిపించారు. ఒక్కసారి బాబు లెవెల్ ఏంటో అక్కడ మళ్లీ నిరూపితమైందని వేరే చెప్పక్కర్లేదు.

యస్..ఇది పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన అరుదైన సన్నివేశం. చంద్రబాబు ఎన్సీపీ నాయకులతో మాట్లాడుతుండగా… కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరీ వచ్చారు. ఆయన స్వతంత్రహోదా ఉన్న నగర వ్యవహారాలు, గృహ నిర్మాణ మంత్రి. చంద్రబాబు దగ్గరకు రాగానే.. సర్ నేను… హదీప్ సింగ్... కేంద్రంలో మంత్రిని... నేను మీ అభిమానని... బ్యూరోక్రాట్ గా ఉన్నప్పటి నుంచి మీ గురించి వింటూనే ఉన్నా... మిమ్మల్ని కలవాలనుకున్నా... ఇప్పుడు మీరు మాతో లేరు... అంటూనే.. నేను మీతో సెల్ఫీ తీసుకుంటా అన్నాడు. చంద్రబాబు నవ్వుతూ ఓకే అనే సరికి సదరు కేంద్ర మంత్రి సెళ్పీ తీసుకున్నాడు. థాంక్యూ చెప్పి వినయంగా వెళ్లిపోయాడు.

అంతవరకు బాగానే ఉన్నా..ఇంతకీ హర్ దీప్ సింగ్ ఎవరో తెలుసా… ఇండియన్ ఫారిన్ సర్వీసులో 30 ఏళ్లకు పైగా పనిచేసి దాదాపు 100 దేశాలు తిరిగిన అధికారి. ఎంతో మందిని చూసిన ఈయన... ఐక్యరాజ్య సమితీలోనూ సెక్యూరిటీ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అందుకే అతనంటే అంత అషామాషీ కాదు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు అపూర్వంగా కనిపించాడు అంటే… ఇక బాబు రేంజ్ ఎంటో చెప్పకనే చెప్పవచ్చు. సదరు కేంద్ర మంత్రి చంద్రబాబుతో.. ఎంతో మందిని చూశాను కానీ.. మీ లాంటి నాయకుడు లేడు అని ఓపెన్ గా అనడం అంటే ఏమనుకోవాలి… దటీజ్ చంద్రబాబు… బాబు ఆలోచనలు అర్థమైనవాళ్లు, వాటి ప్రభావాన్ని ఊహించిన వాళ్లు అలాగే ఫ్యాన్స్ అయిపోతారని.. అక్కడున్న చాలా మంది కామెంట్ చేశారు.

Related Post