మేజ‌ర్లైయ్యాక ల‌గ్గం చేసుకోవ‌చ్చు

news02 June 2, 2018, 3:48 p.m. general

minor couple dationg

కేర‌ళ: సాధార‌ణ‌గా పార్కుల్లో ఎక్క‌డైనా ల‌వ‌ర్స్ క‌న‌బ‌డితే ఛీ... స‌మాజం పూర్తిగా చెడిపోయిదంటాం. మేజ‌ర్లైనా చ‌నువుగా క‌నిపిస్తే..వారిని అదోల చూస్తాం. ఇగ వారు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని తెలిస్తే మాత్రం ఇదేం పోయే కాల‌మనుకుంటాం. పెళ్లి, పెటాకులు లేకుండా...స‌హ‌జీవ‌న‌మేంటని మండిప‌డుతాం. కానీ, ఇదంతా ఒక్క‌ప్పుడు... ఇప్పుడు ఆజమ‌నా పోయింది. ఇప్పుడు మేజ‌ర్లే కాదు.. మైన‌ర్లూ స‌హ‌జీవ‌నం చెయ్యొచ్చంటా...! అందులో ఎలాంటీ త‌ప్పూ లేదంటా...! మైన‌ర్లుగా ఉన్న‌ప్పుడు క‌లిసి జీవించిన వారు... మేజ‌ర్లు అయ్యాక ల‌గ్గం చేసుకోవ‌చ్చంటా...! 
kerala high court

విన‌డానికి ఆశ్చ‌ర్యంగా అనిపించినా...కేర‌ళ హైకోర్టు ఇలాంటీ సంచ‌ల‌న‌మైన తీర్పే ఇచ్చింది. చట్ట ప్రకారం పెళ్లి వయసు రాకపోయినా కలసి జీవించొచ్చ‌ని వెల్ల‌డించింది. అంతేకాదు ఇంతకు ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద‌హ‌రిస్తూ... తీర్పు చెప్పింది. అమ్మాయి, అబ్బాయిలిద్ద‌రూ మైన‌ర్లు అయిన‌ప్ప‌టికీ...ప‌ర‌స్ప‌ర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చ‌ని తెలిపింది. కేరళ అలప్పుళ ప్రాంతానికి చెందిన మహ్మద్ రియాద్ అనే వ్యక్తి త‌న కూతురును ఓవ్య‌క్తి బంధించ‌డని హైకోర్టును ఆశ్ర‌యించాడు. అయితే ఈకేసును విచారించిన హైకోర్టు స‌ద‌రు యువ‌తి అంగీకారంతోనే ఆయువ‌కుడి వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుకుంది. దీంతో మ‌హ్మ‌ద్ రియాద్ పిటిష‌న్‌ను కొట్టివేస్తూ...అత‌ని కూతురుకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. 

minor couples

అయితే హైకోర్టు తీర్పు ఏలా ఉన్నా... ప‌లువురు మాత్రం మైన‌ర్లు స‌హ‌జీవ‌నం చేయ‌మేమిట‌ని ముక్కున వేలేసుకుంటున్నారు. క‌ట్టు-బొట్టు, సంప్ర‌దాయాల‌కు నిల‌య‌మైన స‌మాజంలో మైన‌ర్లు స‌హ‌జీవ‌నం పేరుతో క‌లిసి ఉంటే ఎలాంటీ ప‌రిణామాలు సంభ‌విస్తాయోన‌ని ప‌లువురు పెరేంట్స్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం. 
 

tags: kerala high court, ernakulam, minor couples, minor lovers,

Related Post