మామిడి పండ్లు తిన్న 150 జంట‌ల‌కు 180 మంది మ‌గ పిల్ల‌లు పుట్టారు

news02 June 12, 2018, 3:41 p.m. general

mango
నాసిక్: మామిడి పండ్లు తింటే కొడుకులు పుడుతారంటా...! మామిడి పండ్ల‌ను తిన్న ప్ర‌తి త‌ల్లీ పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుందంటా...! మ్యాంగో ఫ్రూట్స్‌లో మంచి పోష‌కాలుండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మంటా...! విన‌డానికి వింత‌గా ఉంది క‌దూ. బిడ్డ ఆడా,మ‌గ అనేది నిర్ణ‌యించేది దేవుడిచ్చిన వ‌రం...కానీ, మామిడి పండ్లు తింటే మ‌గ బిడ్డ పుట్ట‌డ‌మేమిటీ పైత్యం కాక‌పోతే అనుకుంటున్నారా...?

bide with naredra modi

అవును...మ‌హారాష్ట్రకు చెందిన వివాదస్పద హిందుత్వ నేత శాంబాజీ బిదే ఇలాంటీ వ్యాఖ్య‌లే చేసి అభాసుపాల‌య్యారు. మామిడి పండ్లు, మ‌గ బిడ్డ పుట్ట‌డానికి మ‌ధ్య ఉన్న సంబంధంపై ఆయ‌న చేసిన కామెంట్స్ కంట్రోవ‌ర్సీగా మారాయి. త‌న తోట‌లోని మామిడి పండ్లు తింటే త‌ప్ప‌నిస‌రిగా పండంటి మ‌గ బిడ్డ జ‌న్మిస్తుంద‌ని శంబాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

shambha ji with modi

మామిడి పండ్ల‌లో మంచి పోష‌కాలుండ‌డ‌మే మ‌గ బిడ్డ జ‌న్మించ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని శంభాజీ చెబుతున్నాడు. త‌న తోట‌లోని మామిడి చెట్ల‌ను మంచి పోష‌క విలువ‌ల‌తో పెంచాన‌ని...అందుకే త‌న తోట మామిడి పండ్లు తింటే మ‌గ పిల్ల‌లు పుట్ట‌డం ఖాయ‌మంటున్నాడు. అందుకే త‌న తోట మామిడి పండ్లు తినే త‌ల్లులు అదృష్ట‌వంతుల‌నీ...ఇప్ప‌టి వ‌ర‌కూ 150 జంటలు త‌న తోట మామిడి పండ్లు తిన్నార‌ని...వారికి 180 మంది మగ పిల్లలు పుట్టార‌ని చెప్పుకొచ్చాడు. అందుకే ఎవ‌రికైనా మ‌గ‌పిల్ల‌లు కావాల‌న్నా...సంతానలేమి సమస్యతో బాధప‌డుతున్న త‌న తోట‌ మామిడి పండ్లు సంజీవ‌నిలాగా ప‌నిచేస్తాయ‌ని చెప్ప‌డం విశేషం. 

shambaji

అయితే శంభాజీ వ్యాఖ్య‌లు కాస్తా...ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో...సామాజిక కార్య‌క‌ర్త‌లు, నెటిజ‌న్లు ఆయ‌న‌పై విరుచుకు ప‌డుతున్నారు. శాంబాజీ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని, ఆయ‌న వ్యాఖ్య‌లు హాస్య‌స్పాదంగా ఉన్నాయంటున్నారు. ఇంత‌కీ ఆయ‌న ఏతోట మామిడి పండు తిని పుట్టాడో ముందు చెప్పాల‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

tags: mango fruits,mango fruits information,mango fruits online,mango fruits benefits,mango fruits image,mango fruits information in hindi,,mango fruits information in english,mango fruits name,mango fruits benefits in tamil,mango fruits picture,mango fruits varieties,,mango fruits and vegetable processing plant project report,mango fruits are,mango fruits in a dream,mango tree and fruits,about mango fruits in hindi,mango fruits are oval and,mango king of all fruits,apple mango fruits,the coconut and mango fruits are,alphonso mango fruits,a mango fruit,mango of fruits,mango fruits business,fruits basket manga mango fruits background,mango fruits baby,mango fruit benefits,mango fruit benefits in hindi,mango fruit benefits and side effects,mango fruit benefits during pregnancy,mango fruits calories,mango fruits charlottetown,mango fruits cake,mango fruits company,mango fruits classification,mango fruits carving,,mango fruit calories,mango fruit cream recipe indian,mango fruit composition,,mang

Related Post