నన్నే పైస‌లు అడుగుతావా..?

news02 July 5, 2018, 12:52 p.m. general

true caller fraud

హైద‌రాబాద్‌: ఆండ్రాయిడ్, స‌్మార్ట్ ఫొన్లు వ‌చ్చాక‌...ఎవ‌రు ఏం జిమ్మిక్కులు చేస్తున్నారో అర్థం కాని ప‌రిస్థితి త‌యారైంది. మొబైల్ ఫొన్ల‌కు ఇంట‌ర్‌నెట్ డేటా విప‌రీతంగా అందుబాటులోకి రావ‌డంతో...రోజు రోజుకు కొత్త కొత్త‌ మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఫ‌లితంగా చాలాసార్లు మ‌న క‌ళ్ల ముందు క‌నిపించేది నిజ‌మో..కాదో తెలియ‌క చాలా మంది మొబైల్ యూజ‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక త‌మ‌కు అందుబాటులో ఉన్న యాప్‌తో యూజ‌ర్ల‌ను బురిడీ కొట్టించి క‌ట‌క‌టాల‌పాల‌వుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండ‌డం విశేషం. 

true caller

తాజాగా ఇలాంటీ ఘ‌ట‌నే ఒక్క‌టి హైద‌రాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. అందుబాటులో ఉన్న ట్రూకాలర్ యాప్‌ను ఉప‌యోగించి షాపు కిరాయించిన యాజ‌మానినే బెదిరించి ఓఇద్ద‌రు జైలుపాల‌య్యారు. చ‌ర్లప‌ల్లిలో నివాస‌ముండే బిట్ల వెంకటేశ్వర రావు అదే ప్రాంతంలో ఉజ్వల ఇండస్ట్రీస్‌ పేరుతో ఇట్టీ కంపెనీ నడుపుతున్నాడు. అయితే కంపెనీ స‌రిగా న‌డ‌వ‌క‌పోవ‌డంతో..గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో త‌న కంపెనీని వెంక‌టేశ్వ‌ర‌రావు హితేష్ జైన్, జతిన్ జైన్‌లకు లీజుకు ఇచ్చారు. అయితే కంపెనీని అద్దెకు తీసుకున్నా హితేష్‌, జ‌తిన్ 3 నెల‌ల పాటు వెంక‌టేశ్వ‌ర‌రావుకు అద్దె, కరెంటు బిల్లులు బాగానే క‌ట్టారు. 

true caller
ఏమైందో తెలియ‌దు కాని...ఈఏడాది మార్చి నుంచి రెంట్ ఇవ్వ‌కుండా వెంక‌టేశ్వ‌ర‌రావును తీవ్రంగా వేధించ‌డం సాగారు. అయితే వీరి ఆగ‌డాల‌ను భ‌రించ‌లేని వెంక‌టేశ్వ‌ర‌రావు ...అసోసియేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో...వీరు మ‌రింత రెచ్చిపోయారు. ఇక ముందు డ‌బ్బులు అడిగితే జైలుకు పంపిస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. నేను ఎవరో తెలుసా...డీజీపీనే బెదిరిస్తావా అంటూ హెచ్చ‌రించారు. దీంతో భ‌య‌కంపితుడైన వెంక‌టేశ్వ‌ర‌రావు...పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో...అస‌లు విష‌యం మొత్తం బ‌య‌ట‌ప‌డింది. ట్రూకాల‌ర్ యాప్‌లో జైన్ డీజీపీగా పేరు న‌మోదు చేసుకొని...బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో వెంట‌నే జైన్,హితేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 

police

ఇప్పుడు అర్థం అయింది క‌దా...ఇంట‌ర్‌నెట్‌లో మోసాలు ఎంత సింపుల్‌గా చెయ్యొచ్చొ. అందుకే ఇంట‌ర్‌నెట్ స‌మాచారాన్ని ఒక‌టికి ప‌దిసార్లు వెరిఫై చేసుకున్న త‌ర్వాత‌నే ముందుకు వెళ్లాల‌ని సూచిస్తున్నారు పోలీసులు. లేక‌పోతే జైన్‌కు,హితేష్‌కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు ఖాకీలు.

tags: true caller,

Related Post