V6 యాంకర్ ఆత్మహత్య

news02 April 2, 2018, 6:40 a.m. general

Anchor Radhika reddy sucide

హైదరాబాద్ : తెలుగు సీనియర్ న్యూస్ యాంకర్ రాధికా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు లోని సుశీల్ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి బలవర్మణానికి పాల్పడింది. తెలుగు న్యూస్ ఛానల్ v6 లో రాధిక న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల బులిటీన్ కూడా రాధిక చదివింది. ఆఫీస్ కారులోనే 10.10 నిమిషాలకు ఆమెను ఇంటిదగ్గర డ్రాప్ చేశారు. ఆతర్వాత 10.40 నిమిషాలకు ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Susuce letter

Anchor Radhika reddy sucide letter

తన చావుకు ఎవరు కారణం కారంటూ ఆమె హ్యాండ్ బ్యాగ్ లో సుసైడ్ లెటర్ దొరికింది. తన మైండే తనకు శత్రువు అని పెన్సిల్ తో రాసిన పేపర్ పోలీసులకు దొరికింది. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

anchor Radhika sucide

ఏడాది నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు మానసిక వ్యాధితో బాధపడుతున్న 13 ఏళ్ళ ఒక కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాలతో తల్లిదండ్రులవద్ద మూసాపేట్ లో ఆమె ఉంటున్నట్లు తెలుస్తోంది.అంతలోనే ఏమి జరిగిందనేది తేలాల్సి ఉంది. పోలీస్ లు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

tags: telugu anchoer, v6 news, Radhika sucide, anchor sucide, Radhika reddy, telugu news channal,.

Related Post