నిఘానేత్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ..!

news02 July 4, 2019, 6:07 p.m. general

Trafic signals

హైదరాబాద్ : హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ లు ఎక్కువగా జరుగుతుంటాయి. రెడ్ సిగ్నల్ పడినా కుర్రకారు వేగం తగ్గదు. అవతలి పక్క గ్రీన్ సిగ్నల్ పడి వారి వాహనాలు ముందుకు కదిలినా, వీరు మాత్రం వారిని దాటుకుని దూసుకుపోతుంటారు. ఇలాంటి వారి కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు పెడుతుంటారు. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త టెక్నిక్ ప్రవేశ పెట్టారు.

Trafic signals

హైదరాబాద్‌ పోలీసులు నగరంలో కొత్త ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. కూడలిలో ఉన్న స్తంభాల స్థానంలో జీబ్రా క్రాసింగ్‌ వద్దే వేరు వేరు రంగులు కలిగిన విద్యుత్తు బల్బులు(రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌) ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.

Trafic signals

మీరు ఏ లైట్ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా సర్వైలెన్స్ కెమేరాలు పసిగడతాయి. మీరు రెడ్ సిగ్నల్ పడ్డాక కూడా మీ వాహనాన్ని ముందుకు నడిపిస్తే ఆ లైట్ తో పాటు, మీవాహనం గురించిన సమాచారం క్షణాల్లో ట్రాఫిక్ కంట్రోలింగ్ రూంకి చేరిపోతుంది. కాబట్టి, మీరు వాహనం నడిపేటప్పుడు ఏ సిగ్నల్ ఉందో గమనించండి. లేదంటే మీ ఇంటికి చలాన్‌లు కట్టకట్టుకుని వచ్చేస్తాయి

tags: TRAFFIC SIGNAL, HYDERABAD TRAFFIC POLICE, HYDERABAD TRAFFIC, HYDERABAD, TRAFFIC SIGNALS, TRAFFIC SIGNALS CC CAMERAS, TRAFFIC CHALANS

Related Post