వర్మను తొలగించిన మోదీ కమిటీ

news02 Jan. 11, 2019, 8:23 a.m. general

alok

సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత విధుల్లో చేరిన మరుసటి రోజే ఆయన్ను తొలగిస్తున్నట్లు మోదీ నేతృత్వంలోని కమిటీ ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో సీబీఐకి కొత్త డైరెక్టర్‌ నియామకాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రధాని కార్యాలయంలో రెండు గంటల పాటు జరిగి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు సీబీఐ డైరెక్టర్ ఆలోక్‌ వర్మకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వాలా, ఇవ్వకూడదా అనే అంశంపై చర్చించేందుకు ఉద్దేశించిన అత్యున్నత స్థాయి కమిటీ ముందు బుధవారం సమావేశమైంది. 

cbi

ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి ఉన్నారు. ఆలోక్‌ వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ కమిటీ రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపింది. సెంట్రల్ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక బుధవారం అందకపోవడంతో గురువారం మరోసారి కమిటీ సమావేశమైంది. చివరకు సీవీసీ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నిర్ణయం వెలువడటానికి కాసేపటి ముందు మొత్తం ఐదు మంది సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. 

 

tags: cbi, cbi director, cbi alok varma, govt dismissed alok varma, alok varma dissmissed, cbi director alok varma dissmissed

Related Post