అతి వేగానికి ఏడుగురు బలి

news02 Feb. 21, 2018, 12:56 p.m. general

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు  ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు కార్లలో 11 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Post