మోదీ సమక్షంలోనే వేధింపులు

news02 Feb. 13, 2019, 7:39 a.m. general

manoj

ఈవ్ టీజింగ్.. ఆడవాళ్లను వేధించడం ఈ మధ్య కాంలో మరీ ఎక్కువవుతోంది. ఆడవాళ్లు పనిచేసే దగ్గరి నుంచి మొదలు ప్రతి చోట వాళ్లు వధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఐతే అప్పుడప్పుడు భాద్యాతాయుమైన పదవుల్లో ఉన్నావరు సైతం ఇలంటి వేధింపులుకు పాల్పడుతున్నారు. ఇక ఇప్పుడు  ఓ మంత్రి వేధింపులకు దిగాడు. అది కూడా ఏకంగా మరో మహిళా మంత్రినే వేధించాడు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశమేంటంటే.. సదరు మంత్రి మరో మహిళా మంత్రిని వేధించింది ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందే కావడం. అవును మీరు చదివేది నిజమే. ఇందకీ ఏంజరిగిందంటే.. ప్రధాని మోదీ గత శనివారం త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

manoj
ఈ సందర్భంగా మోదీ ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్‌ కాంతి దేవ్‌ తన పక్కనే నిల్చున్న తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు. తాకరాని చోట ఆ మంత్రి ఆమెను తాకడంతో ఆమె తన చేతితో అతని చేతిని సున్నితంగా తప్పించింది. ఇతందా వీడియోలో రికార్డయ్యింది. ఇంకేముంది ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మంత్రి మనోజ్ కాంతి దేవ్ ను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఈ ఘటనపై స్పందించేందుకు సదరు మంత్రి మనోజ్ కాంతి దేవ్ నిరాకరించారు. ఐతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వేధింపులు ఎదుర్కొన్న సదరు మహిళా మంత్రి కూడా దీనిపై స్పందించలేదు. 

 

tags: He was behaving indecently with the lady minister, He was behaving indecently with the woman minister, minister was behaving indecently with the lady minister, He was behaving indecently with the lady minister presence of pm modi, manoj kanti dev was behaving indecently with the lady minister

Related Post