అలాంటి వాళ్లను..

news02 July 19, 2018, 2:37 p.m. general

anasuya

హైదరాబాద్- అనసూయ.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వారుండరు.. ఇక జబర్దస్త్ ఫ్యాన్స్ కైతే అనసూయ అంటే మహా అభిమానం. ఇటు టీవీ షోల్లోను.. అటు సినిమాల్లోను తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరు పిల్లకు తల్లైనా.. తన ఒంపు సొంపులతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పట్టిస్తున్న అనసూయకు.. కాస్త సామాజిక పట్టింపులు ఎక్కువే. 

anasuya hot

సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లో తన కారులో ప్రయాణిస్తున్న అనసూయకు మరో కారులో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి కనిపించాడు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. సెల్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై అనసూయకు తెగ కోపం వచ్చేసింది. ఇంకేముంది తన సెల్ ఫోన్ లో సదరు వ్యక్తిని వీడియో తీసిుంది అనసూయ. 

anasuya

ఇక ఆ వీడియోను ట్విట్టర్ ద్వార హైదరాబాద్ పోలీసులకు పంపించింది. ఇలా రోట్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసలను కోరింది. గతంలో తాను వేరే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం బారిన పడ్డానని ఆమె గుర్తు చేసింది. అందుకే ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అనసూయ పోలీసులను కోరింది.

tags: anasuya, anasuya bharadwaj, anasuya fire on a man, anasuya fire on rash driver, anasuya compliant on a man, anasuya hot

Related Post