పెర‌గ‌నున్న రోజు కాలం

news02 June 8, 2018, 9:25 a.m. general

one day 25 hours
అమెరికా: మీకెప్పుడైనా కాలంతో పాటు ప‌రుగెత్త‌లేక చిరాకెసిందా..? ఉన్న కొద్ది స‌మ‌యాన్ని అటు ఆపీసు ప‌నుల‌కు, ఇటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు కేటాయించలేక‌పోయారా..? ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకునేందుకు క‌నీసం రోజుకు ఒక్క గంటైనా పెరిగితే బాగుంటుంద‌నిపించిందా..! అవును మీర‌నుకున్న‌ట్లే జ‌ర‌గ‌బోతుంది. రోజుకు 24 గంట‌ల‌కు బ‌దులు...25 గంట‌లు కాబోతుందంటా..! విన‌డానికి ఆశ్చ‌ర్యక‌రంగా అనిపించిన...మ‌రో 2 వేల ఏళ్ల నాటికి భూమిపై ఒక్క రోజు కాలం 25 గంట‌లు కానుందంటా..! 

earth and moon

భూ భ్ర‌మ‌ణంపై కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిస్‌–మాడిసన్ శాస్త్రవేత్త‌లు చేసిన ప‌రిశోధ‌న‌లో ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైంది. 9 కోట్ల ఏళ్ల క్రితం నాటి రాళ్లను  వారు పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకర విష‌యాలు తెలిశాయి. దాదాపు 140 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు సగటున 18 గంటలు మాత్ర‌మే ఒక్క రోజు కాల‌ముండేద‌ని తేలింది. అంతేకాదు అప్ప‌ట్లో గంటకు 41 నిముషాలు మాత్రమే ప్రామాణికంగా తీసుకొనే వార‌ని తెలిసింది. 

columbia university

అయితే అప్ప‌టి నుంచి క్ర‌మ క్ర‌మంగా భూమి ఒక్క‌రోజు కాలం పెర‌గ‌డం ప్రారంభ‌మైంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. భూమండల కక్ష్య నుంచి చందమామ నెమ్మదిగా పక్కకు జ‌ర‌గిపోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అంటున్నారు. జాబిల్లి భూక‌క్ష్య నుంచి దూరం జ‌రిగిన కొద్ది భూభ్రమణం త‌గ్గిపోతూ వ‌స్తోంద‌ని చెబుతున్నారు. ఇలా ప్ర‌తి సంవ‌త్స‌రం చంద్రుడు భూమి క‌క్ష్య నుంచి 3.82 సె.మీ. చొప్పున దూరం జ‌రుగుతున్న‌ట్లు  తెలిపారు. దీని వ‌ల‌న ప‌గ‌లు, రాత్రి వేళ‌ల్లో కూడా తేడాలు రావ‌చ్చంటున్నారు. అయితే శాస్త్రవేత్త‌లు చెప్పింది వింత‌గా అనిపించిన‌...రాబోయే కాలంలో భూ భ్ర‌మ‌ణంపైనే ప‌లువురు ఆవేద‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు. భూ భ్ర‌మ‌ణం గాడి త‌ప్పితే...రుతువులు, రాత్రి-ప‌గ‌లు మ‌ధ్య వ్య‌త్యాసం వ‌చ్చి మొత్తం భూగోళానికే ప్ర‌మాదం పొంచి ఉండ‌వ‌చ్చిని ఆందోళ‌న చెందుతున్నారు.

tags: bhu bramanam,bhu paribhramanam,columbia university,amerika,columbia scientists and engineers for a better society,district of columbia scientists,columbia university scientists, junior research scientists columbia college,columbia science and technology law review,columbia science and engineering library,columbia science academy,columbia science and society,columbia actuarial science,columbia actuarial science acceptance rate,columbia and sciences po,columbia actuarial science gre scores,columbia atmospheric science,columbia scientific balloon facility,columbia scientific balloon,columbia scientific balloon facility palestine tx,columbia science building,columbia scientific balloon facility fort sumner,columbia science balloon facility,columbia biological sciences columbia biological sciences phd,columbia biomedical sciences,columbia basic science course ophthalmology,columbia science center,columbia science center downey,columbia science core,columbia science camp,columbia scientific

Related Post