ఒక్కరే ఎందుకు వస్తున్నారు..

news02 Aug. 14, 2018, 3:04 p.m. general

modi

అమెరికా(ఇంటర్నేషనల్ డెస్క్)- భారత ప్రధాని నరేంద్ర మోదీకి పెళ్లి సంబందాలు చూస్తున్నారు. ఏకంగా ప్రధానికి సంబందం చూసేది ఎవరబ్బా అనుకుంటున్నారా.. అంత దైర్యం ఎవరు చేస్తారు చెప్పండి. సాక్షాత్తు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు. యస్ మీరు విన్నది నిజమే. అమెరికా అధ్యక్షులు ట్రంప్ మన ప్రధాని మోదీకి పెళ్లి సంబందం చూడాలనుకున్నారట. గత సంవత్సరం మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మోదీ గురించిన వివరాలు సేకరించారట. ఐతే వైట్ హౌజ్ కు మోదీ ఒక్కరే వస్తున్నారని తెలుసుకున్న మోదీ.. అదేంటీ ఆయన సతీమణి రావడం లేదా అని అధికారులను అడిగారట.

pmodi trumo

భారత ప్రధాని మోదీ భార్యతనతో ఉండటం లేదని.. మోదీ ఇప్పుడు ఒంచరిగానే ఉంటున్నారని వైట్ హైజ్ అధికారులు ట్రంప్ కు చెప్పారు. దీంతో వెంటనే మోదీకి మనం పెళ్లి సంబందం చూడాలని ఆమెరికా అధ్యక్షులు ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారట. ఈ విషయాన్ని తాజాగా పొలిటికో అనే అమెరికా పత్రిక బయటపెట్టింది. అదన్న మాట సంగతి... అగ్రరాజ్యాధినేత.. ఇలా భారత ప్రధాని మోదీకి పెళ్లి సంబంధం చూస్తానని సరదాగా చెప్పినా.. అది ముఖ్యమైన వార్తే కదా మరి.

tags: trump, modi, trump about modi, trump about modi marriage, us president, america president, trump about modi wife, donald trump, narendra modi, trump about narendra modi, india pm

Related Post