మేం మనుషులం కాదా

news02 March 12, 2019, 8:08 p.m. general

renu

 

నెటిజన్లపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మీరంతా దూషిస్తున్నా సెలబ్రిటీలు మౌనంగా భరించాలా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.. ఇదేం దారుణమని రేణూ నిలదీస్తోంది. మొన్న రైతుల సమస్యల్ని తెలుసుకోవడానికి రేణూ దేశాయ్ పలు గ్రామాల్లో పర్యటించారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు నెటిజన్లు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఒక నెటిజన్ నేను ఓ రైతు కొడుకును. దాదాపు 20 ఏళ్లుగా మేం వ్యవసాయం చేస్తున్నాం. రైతుల కోసం మీరేం చేశారని ప్రశ్నించాడు.. డబ్బుల కోసం మేకప్‌ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేశావంతే అంటూ విమర్శించాడు. 

renu desai

ఇక మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యవి కాబట్టి మీకు ఈ మాత్రం గౌరవం ఇస్తున్నామని అన్నాడు. దీంతో మనస్థానం చెందిన రేణూ దేశాయ్.. ఈ కామెంట్స్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ఇలాంటి పదాల్ని సోషల్‌మీడియాలో ఒక అభిమాని మీద వాడితే మీరు ఉరుకుంటారా అని ఘాటుగా స్పందించారు. ఓ సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు, ఏది పడితే అది అనొచ్చుఅవన్నీ ఆ సెలబ్రిటీ భరించాలా అని ప్రశ్నించారు. మాకు ఎలాంటి భావోద్వేగాలు ఉండకూడదు. మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయా అని రేణూ దేశాయ్ నెటిజన్లను నిలదీశారు.

tags: renu, renu desai, renu desai about pawan, renu desai fire on fans, renu desai fire on pawan fans, renu desai fire on netizens

Related Post