ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం భావ్యం కాదు

news02 July 9, 2018, 2:41 p.m. general

dgp mahender reddy comments on katti mahesh suspend

హైద‌రాబాద్‌: ప‌్ర‌ముఖ సినీ క్రిటిక్, శ్రీ‌రాముడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన క‌త్తి మ‌హేష్‌ హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌పై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్పందించారు. సోమ‌వారం ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి వివ‌రాల‌ను మీడియాకు చెప్పారు. ఈసంద‌ర్భంగా డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ... భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అనేది ఫండ‌మెంట‌ల్ రైటే అయిన‌ప్ప‌టికీ...శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల్గించేలా ఎవ‌రైనా మాట్లాడితే ఉపేక్షించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. అలాంటి వారి వ‌ల్ల స‌మాజంలో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు త‌తెత్తుతాయ‌ని పేర్కొన్నారు. అందుకే హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా మాట్లాడిన క‌త్తి మ‌హేశ్‌ను 6 నెల‌ల పాటు న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేసిన‌ట్లు తెలిపారు. 

katti mahesh

క‌త్తి మ‌హేష్‌ను ఇప్ప‌టికే అదుపులోకి తీసుకొని...ఆయ‌న స్వస్థ‌లం చిత్తూరు జిల్లాకు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు పేర్కొన్నారు. అయితే క‌త్తి మ‌హేష్ క‌నుక 6 ఏళ్ల‌ లోపు న‌గ‌రానికి వ‌స్తే అది నేరం అవుతుంద‌ని...3 ఏళ్లు జైలు శిక్ష ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. శ్రీ‌రాముడిపై కంట్రోవ‌ర్సీ కామెంట్స్‌ను ప్ర‌సారం చేసిన ఓటీవీ ఛానెల్‌కు కూడా నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిపారు. స‌ద‌రు చానెల్ ప్రోగ్రాం కోడ్‌ను అతిక్ర‌మించింద‌ని చెప్పారు. ఆచానెల్ వివ‌ర‌ణ ఇచ్చిన వెంట‌నే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక‌ముందు ఎవ‌రైనా విద్వేష‌పూరిత‌మైన మాట‌లు మాట్లాడ‌డం,వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. లేక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. 

tags: dgp explaination on katti mahesh suspend on hyderabad city,dgp comments on katti,dgp mahender reddy,telangana dgp mahender reddy,hydebad commissioner maheder reddy,kathi mahesh,kathi mahesh wife,kathi mahesh movies,kathi mahesh review,kathi mahesh caste,kathi mahesh paytm,kathi mahesh images,kathi mahesh fb,kathi mahesh photos,kathi mahesh mother,kathi mahesh twitter,kathi mahesh age,kathi mahesh pawan ,kalyan,pawan kalyan kathi mahesh,kathi mahesh address,mahesh kathi actor,mahesh katti about pawan kalyan,kathi mahesh vs aadi,kathi mahesh vs adhi,kathi mahesh vs hyper aadi,mahesh katti review on arjun reddy,kathi mahesh biography,katti mahesh blog,kathi mahesh bigg boss,kathi mahesh biodata,big boss mahesh katti,kathi mahesh facebook,katti mahesh cast,katti mahesh contact number,mahesh kathi comments on pawan kalyan,mahesh kathi comments pawan kalyan,kathi mahesh comments on pk,katti mahesh comments on pawan kalyan,kathi mahesh with pawan kalyan controversy,kathi mahesh critics,katti

Related Post