త‌ప్పిన ప్ర‌మాదం

news02 July 5, 2018, 3:31 p.m. general

cbs demolish

హైద‌రాబాద్‌: ఒక‌ప్పుడు నిజాం కాలంలో ఒక వెలుగు వెలిగి...మొన్నటి వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌ర సిటీ ర‌వాణ‌కు గుండెకాయగా ప‌నిచేసిన గౌలిగూడ సెంట్ర‌ల్ బ‌స్ స్టేష‌న్(సీబీఎస్‌) కుప్ప కూలిపోయింది. గురువారం ఉద‌యం ఈబ‌స్ స్టాండ్ భారీ డోమ్‌లు ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయాయి. ఈఘ‌ట‌న లో ప‌లువురికి గాయాలైన‌ట్లు తెలుస్తోంది. అయితే అధికారులు కొద్దిరోజుల క్రిత‌మే సీబీఎస్‌ను డిమాలిస్ చేయాల‌ని నిర్ణ‌యించారు. బ‌స్టాండ్ పూర్తిగా పాత‌ది కావ‌డంతో పాటు...అఫ్జ‌ల్ గంజ్ నుంచి గౌలిగూడ వైపు ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఈబ‌స్టాండ్ అడ్డుగా ఉండ‌డంతో దీన్ని కూల్చివేయాల‌ని భావించారు. అప్ప‌టి నుంచి సీబీఎస్‌లోకి సీటీ బ‌స్సుల‌ను అనుమ‌తించ‌డం లేదు. అయితే అధికారులు డిమాలిస్ చేయాల‌నుకునే లోపే సీబీఎసే కుప్ప‌కూల‌డం విశేషం. 

cbs demolish

అయితే కూలిపోయిన సెంట్ర‌ల్ బ‌స్ స్టేష‌న్‌కు ఘ‌న‌మైన చ‌రిత్రే ఉంది. దాదాపు 8 ద‌శాబ్దాల పాటు ఈబ‌స్టాండ్ భాగ్య‌న‌గ‌ర‌ వాసుల అవ‌స‌రాల‌ను తీర్చింది. ముఖ్యంగా కోటి నుంచి పాతబ‌స్తీ, బాలాన‌గ‌ర్‌, అమీర్‌పేట‌, మెహిదీప‌ట్నం, చార్మినార్‌, ధూల్‌పేట‌, బ‌హ‌దూర్‌పురా వంటి ప్రాంతాల‌కు సిటీ బ‌స్సులు సీబీఎస్ నుంచే వెళ్లేవి. అలాగే ఆయా ప్రాంతాల నుంచి కోఠి, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, తార్నాక‌, ఈసీఎల్ వైపు వ‌చ్చే బ‌స్సులు కూడా సీబీఎస్‌ని ట‌చ్ చేస్తూ...ట్రావెల్ చేసేవి. దీంతో పాటు కొద్ది రోజులు జిల్లాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఆర్టీసీ సీబీఎస్‌ను ఉప‌యోగించుకుంది. 

cbs

ఇక నిజాం పిరియ‌డ్ నుంచి కూడా సీబీఎస్‌కు విశిష్ట స్థాన‌ముంది. ఆఖ‌రి నిజాంలు సెంట్ర‌ల్ బ‌స్ స్టేష‌న్‌ను విమానాల రాక‌పోక‌ల‌కు వినియోగించారు. హైద‌రాబాద్ నుంచి నిజామేత‌ర ప్రాంతాల‌కు వెళ్లేందుకు సీబీఎస్‌ను వాడుకున్న‌ట్లు చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. ఏదీ ఏమైనా ఆనాటి త‌రానికి...నేటి త‌రానికి తీపి గుర్తుగా మొన్నటి వర‌కు వేలాది హైద‌రాబాదీల మ‌న‌స్సులు కొల్ల‌గొట్టిన సెంట్ర‌ల్ బ‌స్ స్టేష‌న్...క‌నుమ‌రుగైంద‌నే విష‌యం బాధ‌క‌ర‌మ‌నే చెప్పాలి.

tags: demolish cbs,gouliguda central bus stand,gouliguda rtc central bus stand,rtc bus stand demolish,hydebad himli bus stand,rtc bus stand demolish,telangana rtc,buses,hyderabad rtc bus stand,rtc bus stops in hyderabad,mahaveer college rtc bus stop hyderabad telangana,rtc x roads bus stop hyderabad telangana,

Related Post