శంక‌ర్‌ప‌ల్లిలో దారుణం

news02 May 11, 2018, 4:43 p.m. general

shirisha
రంగారెడ్డి: జీవితంపై ప‌రిపూర్ణ‌మైన అవ‌గాహ‌న లేక చేసిన ప‌నులు నిండు జీవితాల‌నే బ‌లి తీసుకుంటున్నాయి. తెలిసి తెలియ‌ని వ‌య‌స్సులో ప్రేమ పేరుతో క‌లిసి తిరిగి చిన్న చిన్న కార‌ణంతోనే ప్రేమికులు ప్రాణాలు తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లి ప్ర‌గ‌తి రిసార్టులో గురువారం జరిగిన శిరీష హ‌త్య కేసులో ఇవే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్రేమించిన అమ్మాయి వేరే వారితో తిర‌గ‌డాన్ని భ‌రించ‌లేక‌నే హ‌త్య చేసిన‌ట్లు నిందితుడు సాయిప్ర‌సాద్ అంగీక‌రించినట్లు స‌మాచారం

shirisha murder

శంక‌ర్‌ప‌ల్లిలో స్థానికంగా డిగ్రీ చ‌దువుతున్న శిరీష‌, సాయిప్ర‌సాద్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే  కొద్ది నెల‌లుగా శిరీష్ వేరే వ్య‌క్తితో చ‌నువుగా ఉంటుంద‌ని అనుమానించిన సాయిప్ర‌సాద్ ఆమెపై  కోపం పెంచుకున్నాడు. ఈనేప‌థ్యంలోనే ఆమెను శంక‌ర్‌ప‌ల్లిలోని ప్ర‌గ‌తి రిసార్టుకు ర‌మ్మ‌నాడు. ఇక్క‌డే ఇద్ద‌రూ రిసార్ట్‌లో కాటేజి బుక్క్ చేసుకొని గ‌డిపారు. అయితే ప‌థ‌కం ప్ర‌కారంమే సాయిప్ర‌సాద్ శిరీషను హ‌త్య చేయాల‌ని భావించి వెన‌క నుంచి క‌త్తితో పొడిచి మ‌ర్డ‌ర్ చేసిన‌ట్లు పోలీసుల ముందు ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది

shirisha 6

అయితే పెళ్లి కాని జంట‌ల‌కు ప్ర‌గ‌తి రిసార్టు వేదిక కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పెళ్లైన దంప‌తుల‌కు ఇవ్వాల్సిన కాటేజిల‌ను ప్రేమికులు, ల‌వ‌ర్స్‌కు ఇవ్వ‌డంపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న ఇలాంటీ రిసార్టుల‌పై పోలీసులు, అధికారులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

tags: murder,shankarpally,pragati resorts,shirisha,saiprasad,rangareddy

Related Post