ఇది హత్యా..? ఆత్మహత్యా..?

news02 Feb. 1, 2019, 9:31 a.m. general

Express TV owner jayaram murder

ఆంధ్రప్రదేశ్ : తెలుగు న్యూస్ ఛానల్ ఓనర్ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి చెందారు. నందిగామ (మ) ఐతవరం గ్రామ సమీపంలో జాతీయరహదారిపై రోడ్డు పక్కన పొల్లాల్లో పడి ఉన్న కారులో జయరాం మృతదేహాన్ని పోలీస్ లు కనుగొన్నారు. చిగురుపాటి జయరాం కోస్టల్ బ్యాంకు చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చగా పోలీసులు గుర్తించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక హత్యనా లేక ఆత్మహత్యా నా అనే కోణంలో పోలీస్ కు దర్యాప్తు చేస్తున్నారు. 

కారు సిసిటివి ఫుటేజ్ లను పలు టోల్గేట్ల నుండి సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు... జయరాం మృతదేహం వెనుక సీట్లో పడి వుండటంతో డ్రైవర్ ఏమయ్యడానే అనుమానాలు కలుగుతున్నాయి. జయరామ్ ఆత్మహత్యా చేసుకున్నాడా.. లేక ఎవరైనా చంపారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కారులో ఆయన మృతదేహం పక్కన ఖాళీ మద్యం సీసాలు వున్నాయి. విషం కలుపుకొని మధ్యం సేవించారా లేక ఇంకేమి జరిగిందనేది పోలీస్ లు అరా తీస్తున్నారు.

Express TV owner murder

*ఆర్థికంగాచితికిపోయినచిగురుపాటి*

అతి తక్కువ సమయంలో పారిశ్రామిక వేత్తగా ఎదిగారు చిగురుపాటి జయరాం. అటు ఫార్మా ఇటు మీడియా లో ఎంట్రీతో జయరాం సంచలనం సృష్టించారు. కొన్నిరకాల మెడిసిన్ లు, కళ్లద్దాలు తయారు చేసే కంపెనీ లు నెలకొల్పారు. ఇవి లాభాల బాటలో నడిచినా .. EXPRESS TV ఏర్పాటు తో నష్టాల్లోకి జారుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర పాటు వార్త ఛానల్ ను సజావుగా నడిపిన జయరాం.. ఆ తరువాత ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. ఉద్యోగులు టివి ఛానల్ ముందు ధర్నాలు, దీక్షలు చేసినా జీతాలు ఇవ్వలేకపోయారు. చివరికి కార్మిక శాఖ అధికారులు నోటీస్ లు ఇచ్చి ఛానల్ ను సీజ్ చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు కొన్ని నెలల క్రింద నే జైల్ కు వెళ్లి వచ్చారు. ఈ విధంగా ఆర్థికంగా చితికిపోయిన చిగురుపాటి ఆత్మహత్యకు పాల్పడ్డా రా లేక ఏదైనా వివాదంలో ఎవరైనా చంపారా అనేది తేలాల్సి వుంది.

tags: Express TV, chigurupati jayaram, Telugu news channels, Telugu channels, telugu news channels owners, Telugu news channels ratings, kvs bank, kvs bank owner, suspisios murder.

Related Post