ఆర్టీసీ ప్ర‌యాణం సుర‌క్షిత‌మేనా..?

news02 May 29, 2018, 11:43 a.m. general

rtc story
హైద‌రాబాద్: ప‌్ర‌గ‌తి ర‌థం.. ప్ర‌జ‌ల నేస్తం. ప్ర‌యాణికులే మా దేవుళ్లు ఇది తెలంగాణ ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌యాణికుల‌కు చెబుతున్న మాట‌లు. ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న వారికి ఎలాంటీ ఇబ్బందులు లేకుండా స‌కాలంలో వారి గ‌మ్య స్థానాల‌కు చేర్చుతామ‌ని అంటోంది. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా డ్రైవ‌ర్లు వ్య‌వ‌రిస్తుండ‌డంతో... ప్ర‌యాణికుల ప్రాణాలు గాల్లో క‌లిసి పోతున్నాయి. గ‌మ్య స్థానం చేరుకునేందుకు డ్రైవ‌ర్లు అనుస‌రిస్తున్న పోటీ విధానం ప్ర‌యాణికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. 

rtc story 10

నీవు ముందా..! నేను ముందా..! అనేది ఇప్పుడు ఆర్టీసీ ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే కాబోలు వాహ‌నాల‌ను డ్రైవ‌ర్లు నిర్ల‌క్ష్యంగా న‌డిపి ప్ర‌యాణికుల‌ ప్రాణాల‌ను బ‌లికొంటున్నారు. ఇక ఆర్టీసీ డిపోల్లో అద్దె బ‌స్సుల సంగ‌తైతే మరి దారుణంగా మారింది. డిపో కోసం అద్దె బ‌స్సులు న‌డుపుతున్న యాజ‌మాన్యాలు డ్రైవ‌ర్ల‌పై క‌నీసం ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌క‌పోవ‌డంతో.. వారు ఇష్టారాజ్యంగా బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అద్దె బ‌స్సు డ్రైవ‌ర్ల డ్రైవింగ్ తీరుపై కూడా ఆర్టీసీ అధికారులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లొస్తున్నాయి. 

rtc story 3

ఆర్టీసీ బ‌స్సును డ్రైవ‌ర్ గ‌మ్యానికి చేర్చేట‌ప్పుడు ఓ సూత్రాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. బస్సు ప్ర‌యాణ వేళ‌ల‌ను క‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది. బ‌స్సు గ‌మ్య‌స్థానానికి ఆల‌స్యంగా వెళ్లిన ఫ‌ర్వాలేదు కానీ, ముందు వెళ్లితే మాత్రం స‌ద‌రు డ్రైవ‌ర్‌పై ఆర్టీసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటుంటారు. అయితే కొంద‌రు అద్దె బ‌స్సులు న‌డుపుతున్న డ్రైవ‌ర్ల‌తో పాటు... ఆర్టీసీ డ్రైవ‌ర్లు  కూడా ఈ నియ‌మాన్ని పాటించ‌డం లేద‌ని స‌మాచారం. మామూలుగానే స్టాటింగ్ పాయింట్ కు ఆల‌స్యంగా చేరుకొని... గ‌మ్య స్థానానికి బ‌స్సు చేర్చేందుకు వేగంగా వెళ్లుతున్న‌ట్లు తెలుస్తోంది. 

rtc story 11

అలా వేగంగా వెళ్లిన సంద‌ర్భంగానే ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్న‌ట్లు ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సిద్దిపేట జిల్లా రిమ్మ‌న‌గూడ ప్ర‌మాదంలో 13 మంది చ‌నిపోవ‌డం, తాజాగా క‌రీంన‌గ‌ర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదానికి గురై 6 మృతి చెందాడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఇప్ప‌టికైనా డ్రైవ‌ర్ల వ్య‌వ‌హ‌ర శైలిపై దృష్టి పెడితే బాగుంటుంద‌ని కోరుతున్నారు. అంతేకాకుండా అద్దె బ‌స్సులు న‌డుపుతున్న డ్రైవ‌ర్ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సిన అవ‌స‌ర‌ముందంటున్నారు. లేక‌పోతే మ‌రిన్ని ప్ర‌మాదాలు జ‌రిగి ఆర్టీసీపై ప్ర‌యాణికుల‌కు న‌మ్మ‌కం పోవ‌చ్చ‌ని అంటున్నారు. 

tags: rtc buses accidents,rtc drivers, hire buses, stating point,karimnagar accident, pragnapur accident

Related Post