ఎగ్జిబిష‌న్ అగ్ని ప్ర‌మాదానికి కార‌ణం ఇదేనా ..?

news02 Jan. 31, 2019, 9:13 p.m. general

nampally exhibition

హైద‌రాబాద్ : నుమాయిష్ ఎగ్జిబిష‌న్ భారీ అగ్నిప్ర‌మాదానికి కార‌ణం ఏంటీ ..? షాట్ స‌ర్క్యూటా .. లేక మాన‌వ త‌ప్పిద‌మా ..? లేక మ‌రేదైనా కార‌ణ‌ముందా ..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుంది. ఈ అగ్ని ప్ర‌మాదం వెనుక దైవ‌శ‌క్తి ఉంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఏమిటీ దైవ‌శ‌క్తి .. అగ్ని ప్ర‌మాదాన్ని ప‌రిశీలించిన  అధికారులు .. ప్రజా ప్రతినిధులను ఆ దృశ్యాలు ఆలోచింపజేశాయి. ఎగ్జిబిషన్‌ సొసైటీ అత్యాశకు పరాకాష్టగా ఈ పరిణామం నిలిచిందన్న విమర్శలు వినిపించాయి. ఎగ్జిబిషన్‌ సొసైటీ అంటేనే నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ అని సొసైటీ నిర్వాహకులు ప్రతిసారీ చెప్పుకుంటారు. కానీ.. మేనేజ్ మెంట్‌ కమిటీలోని కొందరు ప్రాఫిటబుల్‌ వ్యవహారంగా ఈ ఎగ్జిబిషన్ ను వాడుకుంటున్నారన్న విమర్శలు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే బలంగా వినిపిస్తున్నాయి. కనీసం దేవాలయాన్ని కూడా వదిలిపెట్టకుండా.. స్టాల్ ను ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.  ఇక వివ‌రాల్లోకి వెళితే .. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ ప్రాంగణంలో అమ్మవారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం చుట్టూరా దేవుళ్ల పెయింటింగ్స్ ఉన్నాయి. సాధారణంగా ఎగ్జిబిషన్‌ లేని సమయంలో ఆ ఆలయం కనిపిస్తుంది. కానీ.. ఎగ్జిబిషన్‌ నడిచినన్ని రోజులూ.. స్టాళ్ల మధ్యన ఎక్కడో ఉండి ఉంటుందని స్థానికులు కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకునేవాళ్లు కాదు.


 nampally exhibition
కానీ.. ఇప్పుడు అగ్నిప్రమాదం కారణంగా ఎగ్జిబిషన్‌ సొసైటీ సాగిస్తున్న ఈ బండారం బయటపడింది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు.. కొందరు దేవుళ్ల ఫోటోలు ఉన్నాయి. అయితే.. ఈ ఆలయం గోడలు బయటకు కనిపించకుండా పూర్తిగా కవర్స్‌తో కప్పేశారు. ఆలయంపైన కర్రలతో స్టాండ్‌ ఏర్పాటు చేశారు. బయటినుంచి చూస్తే ఆలయం ఏమాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆలయం పైన హైదరాబాద్ కు చెందిన బట్టల వ్యాపారులకు స్టాల్ ను కేటాయించారు. వ్యాపారులు ఆలయం లోపలి భాగాన్ని గోడౌన్ గా కూడా వినియోగించుకుంటున్నట్లు అక్కడ కనిపించిన దృశ్యాలు స్పష్టం చేశాయి. దేవాలయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఏకంగా అమ్మవారి ఆలయం పైనే స్టాల్‌ ఏర్పాటు చేయడంతో అమ్మ‌వారి ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంద‌ని స్థానికులు అంటున్నారు. దీంతోనే అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెబుతున్నారు. 

nampally exhibition

tags: Nampally Exhibition Fire Aaccident,Nampally Exhibition,Durga matha temple at nampally exhibition ground

Related Post